విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించిన పనులు త్తరిగతగతిన పూర్తి చేసి కార్యాలయాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ఎన్‌టిఆర్ విజయవాడ కొత్త జిల్లాకు అవసరమైన కలెక్టరు కార్యాలయ ఏర్పాటుకు సబ్ కలెక్టర్ కార్యాలయ కాంపౌండ్ లో జరుగుతున్న నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఆర్‌డివో యం వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ ఛాంబర్, వీడియోకాన్పరెన్స్, మీని కాన్ఫరెన్స్ హాల్, జాయింట్ కలెక్టర్ ఛాంబర్, అనుబంధ వీడియోకాన్ఫరెన్స్ హాల్స్, మీటింగ్ …
Read More »Latest News
3వ జాతీయ జల అవార్డుల విజేతలను సత్కారం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూడీల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్ 3వ జాతీయ జల అవార్డుల విజేతలను సత్కరించారు. అనంతరం జల శక్తి అభియన్ నిర్వహించనున్న క్యాచ్ ది రెయిన్ ప్రచారం 2022ను ప్రారంభించారు. క్యాచ్ ది రెయిన్ ప్రచారం ఈఏడాది నవంబర్ 2022 వరకు అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సహాయ మంత్రులు …
Read More »వంటనూనెలను ఎమ్మార్పీకన్నా అధిక ధరలకే విక్రయిస్తే చర్యలు…..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు . నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ …
Read More »విజయవాడ లో ఘనంగా ఉగాది పురస్కారాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి ఆశిస్సులతో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది పురస్కారాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు చదువుకోడానికి, ఆర్థిక పరంగా ఆదుకోవడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గత కోవిడ్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భవిష్యత్తులో తమ కార్యాచరణ తెలుపుతూ బ్రాహ్మణ అభివృద్ధికి …
Read More »ప్రభుత్వ భవన ఏర్పాటు పనులను పరిశీలించిన మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త జిల్లాల నుండి పరిపాలన జరిపేందుకు అధికార యంత్రాంగం చక చక సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు కార్యాలయాలు విజయవాడ నుంచి మచిలీపట్నం తరలివస్తున్నాయి. మరోవైపు అద్దె భవనాలలో కునారిల్లుతున్న మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వం ఏర్పాటుచేసిన భవనంలోని వచ్చి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని 12 వ డివిజన్ నోబుల్ కళాశాల ఎదురుగా ఉన్న సువిశాల ఆవరణ గల 1962 నాటి బందరు బీడీ కిళ్ళి వర్తక సంఘం భవన …
Read More »జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక సౌకర్యాలు కచ్చితం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక సౌకర్యాలు కచ్చితంగా ఉండాలని రాష్ట్ర రవాణా ,సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం మండలంలోని గిలకలదిండి, బందరుకోట, ఉల్లింగిపాలెంలో లబ్ధిదారులకు కేటాయించిన జగనన్న లేఔట్లను మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ జె. నివాస్, ఆర్డీవో ఖాజావలి, తహశీల్ధార్ సునీల్ బాబు తదితర ప్రభుత్వ …
Read More »సీనియర్ జర్నలిస్ట్ , ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావుకు ఉగాది పురస్కారం…
విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి ఆశిస్సులతో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది పురస్కారాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ , ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావుతో పాటు వివిధ రంగాలకు చెందిన 67 మందికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ సభలో విశాఖ శారదా పీఠం ఉత్తరాదికారి స్వాత్మా నరేంద్ర స్వామి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి …
Read More »దాతలు వితరణశీలులకు సమాజంలో ఉన్నత స్థానం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నంతలో ఇచ్చేవారు, ఎదుటివారి కష్టానికి స్పందించి ఆ వ్యక్తి లేక సమూహం బాగుపడాలని మనసారా కోరుకొనే గొప్ప వ్యక్తులు దాతలుగా వితరణశీలులగా సమాజంలో ఉన్నత స్థానాన్ని తప్పక పొందుతారని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో పలువురు దాతల సహకారంతో మంగళవారం మధ్యాహ్నం వివిధ వైద్య పరికరాలు వితరణ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి …
Read More »భారత రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జలశక్తి అభియాన్, క్యాచ్ ది రైన్ – 2022 ప్రారంభం
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నిర్వహించిన జలశక్తి అభియాన్, క్యాచ్ ది రైన్–2022 కార్యక్రమమును వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భారత రాష్ట్రపతి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ కార్యక్రమములో కమిషనర్ పి.రంజిత్ భాషా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అధికారులతో కలిసి జలశక్తి అభియాన్, క్యాచ్ ది రైన్ పోగ్రాం మీద ప్రతిజ్ఞా (నీటి శపధం) చేసినారు. 1. నేను …
Read More »గడప గడపకు సంక్షేమం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి వారిని సామాజికంగా,ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడమే లక్ష్యం గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.పార్టీ ఆదేశానుసారం చేపట్టిన గడప గడపకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 12వ డివిజన్ మౌలానా రోడ్డు, రఘు గార్డెన్స్,పప్పులమిల్లు మెయిన్ రోడ్డు నందు ఇంటిఇంటికి పర్యటించిన …
Read More »