Breaking News

ఉమ్రా యాత్రకు మంత్రి ఫరూక్

-మక్కా, మదీనా ప్రార్థన మందిరాల సందర్శన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉమ్రా యాత్రకు బయలుదేరనున్నారు. ఈనెల 10వ తేదీ శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు.ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా, మదీనా ప్రార్థన మందిరాల సందర్శన అనంతరం 18వ తేదీన మంత్రి ఫరూక్ తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్రా యాత్రకు బయలుదేరుతున్న మంత్రి ఫరూక్ ను మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య అధికారులు, ఇంకా పలువురు ముఖ్యులు అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్రా యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని రావాలని ఆకాంక్షిస్తూ దువా చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం, శాంతి సౌభాగ్యాల కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఉమ్రా యాత్రలో ప్రార్థిస్తానని పేర్కొన్నారు.

చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి.. మంత్రి ఫరూక్
జీవన మార్గంలో ఏ రంగంలో రాణించాలన్నా , చదువుకోవడం ద్వారానే అది సాధ్యమవుతుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. గురువారం అమరావతి లోని తన క్యాంపు కార్యాలయంలో భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలిగా, ఆదర్శప్రాయురాలిగా నిలిచిన షేక్ ఫాతిమా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. షేక్ ఫాతిమా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే లతో కలిసి షేక్ ఫాతిమా కలిసి పని చేశారని అన్నారు. బాలికా విద్య కోసం అహర్నిశలు కృషిచేసిన భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలిగా షేక్ ఫాతిమా కార్యాచరణ అమలు లో ఎన్నో ఇబ్బందులకు, భౌతిక దాడులకు కూడా గురైనప్పటికీ తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసిన ఘనత సొంతం చేసుకుని భావితరాలకు ఆదర్శప్రాయురాలిగా నిలిచిందని అన్నారు. మైనారిటీ వర్గాలు, ప్రజలందరూ చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం,ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. చదువు తోనే తాము అనుకున్న రంగంలో ఉన్నత స్థాయిలోకి చేరేందుకు మార్గం సులభతరం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి , అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. బాలిక విద్య కోసం ఎంతో కృషి చేసిన షేక్ ఫాతిమా సేవలను ప్రభుత్వం 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో ఆమె జీవిత చరిత్రను, సేవలు, పడిన కష్టాలను సవివరంగా పేర్కొంటూ తెలుగు పాఠ్యపుస్తకంలో చేర్చి తగిన గౌరవం కల్పించడం జరిగిందని మంత్రి ఫరూక్ అన్నారు.

ఉరుసు వేడుకలకు హాజరైన మంత్రి ఫరూక్
విజయవాడ సమీపంలోని కొండపల్లి గ్రామంలో జరిగిన హజరత్ సయ్యద్ షా బొఖారి(ర. అ) వారి 428 వ ఉరుసు- ముబారక్ ఉరుసు మహోత్సవం తొలి రోజు కార్యక్రమానికి న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. మూడు రోజులపాటు ఉరుసు మహోత్సవాన్ని నిర్వాహకులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పురాతన దర్గాను సందర్శించిన మంత్రి ఫరూక్ చాదర్ ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ, పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెడ్ ప్లస్ ఆదిత్య ఫార్మసీ మెడికల్ షాప్ గొప్ప ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెడ్ ప్లస్ ఆదిత్య ఫార్మసీ మెడికల్ షాప్ ఘనంగా ప్రారంభించడం జరిగింది. స్థానిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *