Breaking News

Latest News

ఘనంగా ముగిసిన సీఎం కప్ క్రీడా పోటీలు

-క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు.. మానసిక ఉల్లాసాన్నిస్తాయి… -ప్రతి మూడు నెలలకొకసారి క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తాం .. -తణుకు శాసనసభ్యులు డా .కారుమూరి నాగేశ్వర రావు తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తణుకు శాసనసభ్యులు డా.కారుమూరి నాగేశ్వర రావు అన్నారు. తణుకు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సీఎం కప్ క్రీడోత్సవాల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మేల్యే కారుమూరి నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా …

Read More »

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకునిగా రాష్ట్ర కార్యదర్శి నవనీతంసాంబశివరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకునిగా నియమితులయిన రాష్ట్ర కార్యదర్శి నవనీతంసాంబశివరావు ను టీడీపీ పోలిట్ భ్యురో సభ్యులు, Ex.MLA బోండా ఉమా అభినందించారు.. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ పార్టీ కోసం కస్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం ఎల్లప్పుడూ సముచిత స్థానం కల్పించడంలో ముందుంటుందని, నేడు పార్టీ కల్పించిన ఈ పదవితో మరింత చురుకుగా పనిచేసి 2024ఎన్నికల్లో టీడీపీ గెలుపె లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.. సాంబశివరావుకి భవిష్యత్తులో మరింత పెద్ద పదవులు రావాలని కోరుతున్నాం …

Read More »

శాస్త్రోక్తంగా శ్రీ క‌ల్యాణ వెంక‌న్న‌ చక్రస్నానం…

-ముగిసిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్ర జ‌లం నింపిన గంగాళంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ముందుగా ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం చ‌క్ర‌స్నానం జ‌రిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, …

Read More »

మహా శివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సందేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రి పవిత్రదినం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహా శివరాత్రి, లక్షలాది మంది శివుని భక్తులకు అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన ఆధ్యాత్మిక పండుగ. ఈ రోజును ఉత్సాహంగా, భక్తితో జరుపుకుంటారు. ఈ పర్వ దినాన శివుడిని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ శుభ సందర్భం మనందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వం తో కూడిన ఉదాత్తమైన ఆలోచనలను ప్రేరేపిస్తుంది. ఈ శుభ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. …

Read More »

గవర్నర్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి

-అసెంబ్లీ సమావేశాలకు అహ్వానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా కలిసారు. సోమవారం రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. దాదాపు అరగంట పాటు వీరి భేటీ సాగగా, సమకాలీన రాజకీయ అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకున్నారు. అతి త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న …

Read More »

సోమవారం స్పందన లో 5 ఆర్జీలు వొచ్చాయి… : ఆర్డీవో ఎస్. మల్లిబాబు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలపై మండల, గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది స్పందించి క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపాలని రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లి బాబు తెలియచేసా రు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పం దన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మ ల్లిబాబు మాట్లాడుతూ ప్రజల సమస్య లు ఏమైనా ఉంటే ఆయా మండలాలకు సంబం దించిన తాహిసీల్దార్, గ్రామ వార్డు సచివాలయా ల్లో దరఖాస్తు లు చేసుకుంటే త్వరిత గతిన సమస్యలు …

Read More »

విద్యార్థిని, విద్యార్థులు సైన్స్ అధ్యాయనం, ఆవిష్కరణలు పట్ల ఆశక్తి పెంచుకోవాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థిని, విద్యార్థులు సైన్స్ అధ్యాయనం, ఆవిష్కరణలు పట్ల ఆశక్తి పెంచుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జె. సునీత పేర్కొన్నారు. సోమవారం స్థానిక డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, సర్ సివి రామన్ భౌతిక శాస్త్రం లో చేసిన రామన్ ఎఫెక్ట్ కి నోబుల్ బహుమతి పొందినట్లు తెలిపారు. రామన్ ప్రభావం మూలాల, పరిశోధన లు పై విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి సైన్స్ పై ఆసక్తి …

Read More »

భక్తులకు భద్రత తో కూడి త్వరితగతి దర్శనం కల్పించాలి…

పోలవరం (పట్టిసం), నేటి పత్రిక ప్రజావార్త : శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి దర్శనానికి వొచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. సోమవారం పట్టిసం లో శ్రీ వీరేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలలో విధుల్లో చేరిన అధికారులు, సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శాఖ వారికి కేటాయించిన భాద్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. శివరాత్రి సందర్భంగా పట్టిసం లోని భద్ర కాళీ సమేత వీరేశ్వరస్వామి …

Read More »

‘నా ఓటు నా భవిత – ఒక ఓటుకున్న శక్తి’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 28, 2022 జాతీయ ఓటర్ల దినోత్సవం -2022 ను పురస్కరించుకొని భారత మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ‘నా ఓటు నా భవిత – ఒక ఓటుకున్న శక్తి’ అంశం పై ఓటరు చైతన్య పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలలో మొత్తంగా 5 విభాగాలైన క్విజ్, షార్ట్ ఫిల్మ్, పోస్టర్ డిజైన్, పాటల మరియు ఫ్లోగన్ వంటి విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఇందులో అన్ని వయస్సుల వారు …

Read More »

గన్నవరం విచ్చేసిన భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

-ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సోమవారం ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. బెంగుళూరు నుండి ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం 4.55 ని.లకు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఉప రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందించి ఘనంగా స్వాగతం …

Read More »