-అసెంబ్లీ సమావేశాలకు అహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా కలిసారు. సోమవారం రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. దాదాపు అరగంట పాటు వీరి భేటీ సాగగా, సమకాలీన రాజకీయ అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకున్నారు. అతి త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయాన్ని ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకువచ్చి అనుమతి తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్ ను ఆహ్వానించారు. మరోవైపు ప్రభుత్వం జిల్లాల పునర్ విభజన చేపట్టనుండగా ఆవిషయాన్ని కూడా సిఎం గౌరవ బిశ్వ భూషణ్ కు వివరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్ విభజన జరుగుతుందని, ప్రజల నుండి వినతులను స్వీకరించి ఆమోదయోగ్యమైన రీతిలో నూతన జిల్లాలను ఆవిష్కరించనున్నామని వివరించారు. కార్యక్రమంలో శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు
Prajavartha Online Telugu News