-అందరికీ అవగాహన కోసమే సదస్సులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్ కార్యక్రమంపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒకవైపు అవగాహన కల్పిస్తూ ఉంటేనే కొందరు ఈ విధానాన్ని విద్యా విధ్వంసం అని సంబోధించడాన్ని మంత్రి ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని, వాటి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. జాతీయ విద్యా విధానం లో …
Read More »Latest News
16మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ ఏర్పాటు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చైర్మన్ సహా 16మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీనీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.ఈమేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు జిఓఆర్టీ సంఖ్య 7 ద్వారా ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.ఈ హజ్ కమిటీకి ఎపి స్టేట్ వక్ప్ బోర్డు అధ్యక్షులు(ప్రస్తుతం కాంపిటెంట్ అధారిటీ ద్వారా నిర్వహించబడుతోంది)గా ఉంటారు.ఎగ్జిక్యూటివ్ అధికారి స్టేట్ వక్ప్ బోర్డు హజ్ కమిటీకి ఎక్స్ అఫీసియో సభ్యులుగా మరియు సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు.ఇంకా ఈస్టేట్ హజ్ …
Read More »శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు ముచ్చింతల్ ముస్తాబు
-45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో దివ్యక్షేత్రం ఆరేళ్లలో నిర్మాణం -216 అడుగుల ఎత్తుతో రామానుజుల పంచలోహ విగ్రహం -బరువు 1800 కిలోలు.. చైనాలో 1600 భాగాలుగా తయారీ -గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’ -సమతామూర్తి చుట్టూ 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం -2 నుంచి 14వ తేదీ దాకా 12 రోజుల పాటు ఉత్సవాలు -వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని.. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో కార్యక్రమం -5న మోదీ రాక.. మహావిగ్రహ ఆవిష్కరణ.. జాతికి అంకితం -13న రాష్ట్రపతి రాక.. నిత్యపూజా …
Read More »మిస్డ్ కాల్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు – కోవిడ్ బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ బాధితుల కోసం ఎన్టీ ఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం మొదలు పెట్టింది. కోవిడ్ బాధితులు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కోవిడ్ కు వైద్య సాయం పొందే ఏర్పాట్లు చేసింది. దీని కోసం ఎన్టీ ఆర్ ట్రస్ట్ ప్రత్యేకంగా ఒక నెంబర్ ను కేటాయించింది. కోవిడ్ కు టెలిమెడిసిన్ సాయం కావాలి అనుకున్న వారు 8801033323 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన వారి మొబైల్ ఫోన్ కు టెలిమెడిసిన్ …
Read More »ఆర్ ఆర్ బి , ఎన్టీపీసీ పరీక్షపై అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు తక్షణం స్పందించిన రైల్వే శాఖ…
-అభ్యర్థులు/ఆశావహుల ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రీకృత ఉపాధి నోటీసు నెంబర్ 01/2019 (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ కోసం గ్రాడ్యుయేట్ మరియు అండర్-గ్రాడ్యుయేట్) ప్రకారం పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న ప్రక్రియపై కొంతమంది అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు/ సందేహాలపై రైల్వే శాఖ స్పందించింది. పరీక్ష రెండవ దశకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు అనుసరిస్తున్న విధానం పట్ల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు/ అనుమానులు వ్యక్తమయ్యాయి. వీటిపై స్పందించిన రైల్వే రిక్రూట్మెంట్ …
Read More »1, 2 తేదీల్లో ఉద్యోగులకు సంఘీభావంగా సదస్సులు…
-పిఆర్సి జీవోలు రద్దు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి. -సమ్మెను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. -ప్రభుత్వం పట్టుదలకు పోకుండా సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టాలి. – వామపక్ష పార్టీల డిమాండ్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు, పెన్షనర్లు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యాన ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు …
Read More »పారిశుధ్య పనుల పరిశీలన, క్షేత్ర స్థాయిలో సూక్ష్మ ప్రణాళికలను అమలు చేయాలి…
-కమీషనర్ పి.రంజిత్ భాషా ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా ఐ.ఏ.ఎస్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో 4వ శానిటరీ డివిజన్ నందలి పలు వీధులలో పారిశుధ్య నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొన్నారు. డివిజన్ నందు ఇంటింటి చెత్త సేకరణ విషయమై శానిటరీ కార్మికురాలిని నివాసాల వారు నేరుగా చెత్తను విభజించి అందిస్తున్నది లేనిది అడిగితెలుసుకొనిన సందర్భంలో సెగ్రిగేషన్ విధానము అమలు చేస్తున్న తీరు, చెత్త తరలింపు విధానము మొదలగు అంశాలను స్వయంగా పరిశీలించారు. …
Read More »శ్రీ సి రాఘవాచారి ప్రెస్ అకాడమి చైర్మన్ దేవిరెడ్డి పదవీకాలం పొడిగింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ చక్రవర్తుల రాఘవాచారి ఎ పి ప్రెస్ అకాడమి చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాద్ రెండేళ్ల పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మరో ఏడాది కాలానికి పదవీకాలం ను పొడిగించింది. 2022 జనవరి 8 తేది నుంచి వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీచేసింది. కరోన మహమ్మారి ప్రపంచం అంతా భయబ్రాంతులను గురిచేస్తున్న దశలో శ్రీనాథ్ తన రెండేళ్ళ పదవీ కాలంలో ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా 13 జిల్లాల్లో పర్యటించి ఆన్ …
Read More »రైల్వే శాఖ, కేంద్ర బిజెపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎన్.ఎస్.యు. ఐ. నిరసన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా నియామక నిరుద్యోగ యువత పై దాష్టికంగా లాఠీ దాడులు, కాల్పులు జరిపించిన కేంద్ర బిజెపి ప్రభుత్వం పాలన తీరును ఖండిస్తూ రైల్వే హైపర్ కమిటీతో పాటు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ఎన్.ఎస్.యు. ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ఆధ్వర్యములో నిరసన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ క్యాటగిరి RRB NTPC cbt 1 పరీక్షల నిర్వహణ, రిజల్ట్స్ అవకతవకలపై శాంతియుత ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువత పై …
Read More »శ్రీనివాసమంగాపురంలో విశేష రోజుల్లో వర్చువల్ కల్యాణోత్సవ సేవ…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముఖ్య పర్వదినాల్లో నిర్వహించే కల్యాణోత్సవాన్ని వర్చువల్ సేవగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. భక్తులు ఆన్‌లైన్ ద్వారా కల్యాణోత్సవం సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 5న వసంత పంచమి సందర్భంగా వర్చువల్ కల్యాణోత్సవం సేవ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 12న ఏకాదశి, ఏప్రిల్ 2న ఉగాది, ఏప్రిల్ 16న చైత్ర పౌర్ణిమ, మే 21న శ్రవణా నక్షత్రం సందర్భంగా ఈ సేవ నిర్వహిస్తారు. అలాగే, జూన్ 11న ద్వాదశి, జూన్ …
Read More »