Latest News

న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన వారిపై కేసు…

-డ్రైవ‌ర్లు మోసం చేస్తే వాహ‌నాలు, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం : సివిఎస్వో తిరుమ‌ల‌, నేటి పత్రిక ప్రజావార్త : న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన ఆటోడ్రైవ‌ర్‌తోపాటు మ‌రొక‌రిపై తిరుమల విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదు మేర‌కు తిరుమల టు టౌన్‌ పోలీసులు కేసు న‌మోదు చేశారు. తిరుమ‌ల రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం కాంప్లెక్స్‌లోని స్కానింగ్ సెంటర్‌లో విజిలెన్స్ వింగ్ అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించ‌గా అనుమానాస్పదంగా ఉన్నపాండిచ్చేరికి చెందిన సి.సుబ్రమణియ‌న్, అత‌ని స్నేహితులను క‌లిపి ముగ్గురిని విచారించారు. తిరుప‌తిలో ఆటో …

Read More »

ఏపీ సేవ 2.ఓ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ (ఏపీ సేవ 2.ఓ (టూ పాయింట్‌ ఓ) పోర్టల్‌) ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… మరింత వేగం, పారదర్శకత, జవాబుదారీతనం దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌(సీఎస్‌పీ) ప్రారంభిస్తున్నాం. పలకడానికి అనువుగా దీనికి ఏపీ సేవ అని పేరు పెట్టి ఈ పోర్టల్‌ను ఇవాళ ప్రారంభిస్తున్నాం. దీనివల్ల …

Read More »

శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో అండ్‌ ఎండీ గజనన్‌ నబర్, కమర్షియల్‌ హెడ్‌ శరద్‌ మధోక్, శ్రీసిటీ జీఎం (కార్పొరేట్‌ ఎఫైర్స్‌) సీహెచ్‌.రవికృష్ణ పాల్గొన్నారు. శ్రీసిటీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. …

Read More »

ఆంధ్రప్రదేశ్ BC ఫెడరేషన్ కృష్ణా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడుగా పడమట రవికుమార్ నియామకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో శ్రీనివాసరావు ఫెడరేషన్ కండువా కప్పి ఫెడరేషన్లోకి ప్రముఖ న్యాయవాది పడమట రవికుమార్ ని ఆహ్వానించగా తమ్మిశెట్టి చక్రవర్తి అతనిని కృష్ణా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడుగా ప్రకటించి నియామక పత్రాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో …

Read More »

ఎపి సివిల్ సర్వీస్ అసోసియేషన్-2022 డైరీని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి కృష్ణదాసు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచి)అసోసియేషన్(డిప్యూటీ కలక్టర్స్ అండ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ అసోసియేషన్)డైరీ-2022ను గురువారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి(రెవెన్యూ)ధర్మాన కృష్ణదాసు ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో ఎపి సచివాలయ మరియు ఎపి సివిల్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Read More »

ఉపాధ్యాయుల పదోన్నతి బదిలీ కౌన్సిలింగ్ లో విజువల్లీ చాలెంజ్డ్(బ్లైండ్)వారికి ప్రాధాన్యత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రొ-డిజబిలిటీ పాలసీలో భాగంగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు,ప్రమోషన్ల కౌన్సిలింగ్ లో విజువల్లీ చాలెంజ్డ్(బ్లైండ్)అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేశ్ కుమార్ తెలియజేశారు.కావున ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు ప్రదోన్నతికి చేపట్టే కౌన్సింగ్ నిర్వహణలో విజువల్లీ చాలెంజ్డ్(బ్లైండ్)ఉపాధ్యాయులకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.

Read More »

బిసి వృత్తులలో ఉన్న ఎస్ సిలకు ఆర్ధిక సహాయం…

-సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న పధకాలు క్షేత్ర స్ధాయిలో ఫలితాలను అందించేలా కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని అప్పుడే ఆశించిన లక్ష్యాలను సాధించగలుగుతామని వివరించారు. సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గురువారం సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన చంద్రుడు, అనంతరం …

Read More »

జూన్ నెలాఖరుకు గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారుకు చర్యలు…

-గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర మెరుగైన సేవలందించాలి -సిబ్బంది రోజూ మధ్యాహ్నం 3నుండి5గం.లవరకూ ప్రజలకు అందుబాటులో ఉండాలి -త్వరలో గ్రామ వార్డు సచివాలయాల్లోని ఖాళీల భర్తీ -గ్రామ,వార్డు సచివాలయాల కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే జూన్ నెలాఖరులోగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను డిక్లేర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు.గురువారం అమరావతి సచివాలయం మూడవ …

Read More »

మన విద్యా పధకాల వైపు ఇతర రాష్ట్రాల చూపు…

-అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్. -విద్యాకార్యక్రమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలవుతున్న విద్యా పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తూ వాటిని అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని విద్యారంగంలో అమలు చేస్తున్న పధకాలపై ప్రజాప్రతినిధులు అవగాహన కలిగివుండాలని మంత్రి కోరారు. జాతీయ విద్యా విధానం లో భాగంగా స్కూల్స్ మ్యాపింగ్ …

Read More »

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు

-రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు. – గిరిజనుల అభివృద్ది కోసం రెండు గిరిజన జిల్లాలు -అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు. -విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా ఒంగోలు.. చిన్నజిల్లా విశాఖపట్నం.. -వివరాలను వెల్లడించిన ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ జి. ఎస్ఆర్ కెఆర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగానే జరిగిందని.. భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రత, సాంఘిక, సంస్కృతి ప్రకారం జిల్లాలను విభజించామని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. …

Read More »