Breaking News

Latest News

స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలన్నదే జగనన్న లక్ష్యం…

-మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా 73 వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడిండి. అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తొలుత జాతిపిత మహాత్మ గాంధీజీ చిత్ర …

Read More »

దుర్గాపురం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పరిపాల‌న సాగిస్తున్నార‌ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మగాంధీ, పింగళి వెంకయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా …

Read More »

రాష్ట్రాభివృద్ధికి ప్రజలందరూ పునరంకితం కావాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగంపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా బీసెంట్ రోడ్డులో త్రివర్ణ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. దేశానికి స్వాత్రంత్ర్యం ఎంత అవసరమో.. ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగం కూడా అంతే అవసరమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలు, తెగలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు …

Read More »

యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 25 వ డివిజన్ ఎంప్లాయిమెంట్ రోడ్డు కాల్వ గట్టు వద్ద టెన్నీస్ కోర్డును స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతలాదేవితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కాసేపు టెన్నీస్ ఆడి సరదాగా గడిపారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లోకూడా రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడలతో యువతలో క్రమశిక్షణ, …

Read More »

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 73ఏళ్ళు పూర్తి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 1947 ఆగస్ట్ 29న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అధ్యక్షులుగా రాజ్యాంగాన్ని రాసే డ్రాఫ్ట్ కమిటీ ఏర్పడింది అని, 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించింది అని అందువల్ల నవంబర్ 26ని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని తూర్పు నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. అవినాష్ మాట్లాడుతూ 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు అని అప్పటి నుంచి మన భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా …

Read More »

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న మంత్రి వెలంప‌ల్లి…

అమ‌రావ‌తి,  నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో శంషాబాద్ దగ్గరలో “శ్రీ రామానుజ సహస్ర శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా 216 అడుగుల సమతామూర్తి శ్రీ రామనుజుల వారి విగ్రహావిష్కరణ ఫిబ్ర‌వ‌రి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే ప్రారంభిస్తున్న సంద‌ర్భంగా ఏపి దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు మంగ‌ళ‌వారం జీయర్ స్వామిని కలిసి ఆ ప్రాంగణాన్ని సందర్సించి కార్యక్రమ వివరాలు తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా చిన‌జీయ‌ర్ ఆశీస్సులు అందుకున్నారు.

Read More »

73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సందేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. గణతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ పున: అంకితం కావలసిన రోజు ఇది. ఈ రోజు మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభవించేందుకు తోడ్పడిన గొప్ప దేశభక్తులందరి స్మారక దినం. స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు పున: అంకితం చేసే రోజు. ఈ పవిత్రమైన రోజున, దేశ …

Read More »

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఆర్ పి సిసోడియా…

-కాన్వాయ్, గౌరవ వందనంతో పూర్తి స్దాయి రిహార్సల్స్ నిర్వహణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ఇందిరాగాంధీ నగర పాలక సంస్ధ క్రీడా మైదానంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా మంగళ వారం పరిశీలించారు. గణతంత్ర దినోత్సవం కోసం క్రీడా మైదానాన్ని ముస్తాబు చేస్తుండగా, బుధవారం నాడు కార్యక్రమాలు నిర్వహించే తీరుగానే మంగళవారం రిహార్సల్స్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ నివాస్, నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, రాష్ట్ర ప్రోటోకాల్ …

Read More »

భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన అమూల్యమైన హక్కు ఓటు…

-రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్యంలో ఓటు శక్తివంతమైన సాధనమని, భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన అమూల్యమైన హక్కు అని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌ నుండి మంగళవారం హైబ్రీడ్ మోడ్‌లో జరిగిన 12వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఇది దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికల భాగస్వామ్యానికి సంబంధించిన వేడుక అని అన్నారు. ‘ఓటరు వదిలివేయబడడు’ అనే నినాదంతో అన్ని …

Read More »

ఓటరుగా నమోదు ఎన్నికల ప్రక్రియలో యువత చురుకైన పాత్ర పోషించాలి : రాష్ట్ర గవర్నర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో భాగంగా ఓటరుగా నమోదు ఎన్నికల ప్రక్రియలో నేటి యువత క్రియాశీలకమైన పాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు నిచ్చారు.మంగళవారం 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సచివాలయం ఐదవ బ్లాకు కలక్టర్ల సమావేశ మందిరంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ విజయవాడ రాజ్ భవన్ నుండి ఆన్లైన్ వెబ్ నార్ ద్వారా పాల్గొన్నారు.తొలుత రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ కార్యక్రమానికి స్వాగతం పలకగా కార్యక్రమంలో …

Read More »