Breaking News

Latest News

ఓటరుగా నమోదు ఎన్నికల ప్రక్రియలో యువత చురుకైన పాత్ర పోషించాలి : రాష్ట్ర గవర్నర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో భాగంగా ఓటరుగా నమోదు ఎన్నికల ప్రక్రియలో నేటి యువత క్రియాశీలకమైన పాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు నిచ్చారు.మంగళవారం 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సచివాలయం ఐదవ బ్లాకు కలక్టర్ల సమావేశ మందిరంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ విజయవాడ రాజ్ భవన్ నుండి ఆన్లైన్ వెబ్ నార్ ద్వారా పాల్గొన్నారు.తొలుత రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ కార్యక్రమానికి స్వాగతం పలకగా కార్యక్రమంలో …

Read More »

కనువిందు చేయనున్న గణతంత్ర వేడుకలు…

-త్రివర్ణ పతాకాలతో విద్యుత్‌ దీపాలతో ముస్తాబైన ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం… -పుల్‌ డ్రెస్‌ రిహర్సల్‌ పరిశీలించిన రాష్ట్ర గవర్నర్‌ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆర్‌పి సిశోడియా… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవ శోభ, జాతీయ సమైఖ్యత ఉట్టిపడేలా త్రివర్ణ పతాకాలతో విద్యుత్‌ దీపాలతో ముస్తాబైన ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబందించి మంగళవారం పుల్‌ డ్రెస్‌ రిహర్సల్స్‌ నిర్వహించారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన 73వ గణతంత్ర వేడుకల పుల్‌ డ్రెస్‌ రిహర్సల్స్‌ను రాష్ట్ర …

Read More »

బాపు మ్యూజియంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉన్న జానపద కళల పై ప్రజలకు ఆసక్తి పెరిగితే కళారూపాలు కూడా పునరంకితం అవుతాయని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా) కె. మోహన్‌కుమార్‌ చెప్పారు. మంగళవారం స్థానిక బాపు మ్యూజియంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా జాతీయ ప్రర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా కోలాటం, డప్పు విన్యాసం తదితర కళారూపాల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన …

Read More »

ఇబిసి పథకం ద్వారా 30,913 మంది మహిళలకు రూ.46.37 కోట్లు లబ్ధి… : కలెక్టర్‌ జె. నివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయిన ఈబీసి ( ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాలు)లోని పేద మహిళాలకు మేలు చేకూరీ వారి జీవనోపాధి, ఆర్థికసాధికారతే లక్ష్యంగా వైఎస్సార్‌ ఇబిసి నేస్తం పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ క్షత్రియ, వెలమల లతో పాటు ఇతర ఓసి సామాజిక వర్గాలకు చెందిన 3,92,674 మంది పేద మహిళా లబ్దిదారులకు …

Read More »

నూజివీడు డివిజన్ లో జనవరి 25 వ తేదీన 20 కోవిడ్ కేసులు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో 25వ తేదీన 20 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం మండలం లో 5, ఉంగుటూరు 2, , బాపులపాడు 9 , నూజివీడు అర్బన్ 2 , పమిడిముక్కలలో 1, అగిరిపల్లి మండలంలో 1 కేసులు నమోదయ్యాయన్నారు. . కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సానిటైజెర్ వినియోగించాలని, బహిరంగ ప్రదేశాలలో సామాజిక …

Read More »

వేడుకలకు శకటాలు సిద్ధం…

-తుది ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించే అలంకృత శకటాల తుది ఏర్పాట్లను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో మంగళవారం సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వేడుకలలో వివిధ శాఖలకు చెందిన 16 శకటాల ప్రదర్శన ఉంటుందన్నారు. రైతు భరోసా పై …

Read More »

ఈనెల 27న జిల్లా ఇంఛార్జి మంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలో ఈనెల 27న జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నూతనంగా నిర్మించబడిన కమ్యూనిటీ హాల్స్, సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ నగర్, ముత్యాలంపాడు, మధురానగర్ మరియు ఇందిరాగాంధీ స్టేడియంలలో జరుగుతున్న పనులను స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జిలు, అధికారులతో కలసి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు …

Read More »

మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు…

-ఈబీసీ నేస్తం పథకం ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళా సాధికారత సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఈబీసీ నేస్తం పథకం ప్రారంభోత్సవ అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటును అందిస్తున్నట్లు వివరించారు. ఈబీసీ నేస్తం, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన …

Read More »

అగ్రవర్ణ పేదలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈబీసీ నేస్తం పథకానీ తాడేపల్లి క్యాంపు కార్యాయలం నుంచి ప్రారంభించినందుకు వారికి అవినాష్ ధన్యవాదములు తెలిపారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తు జగనన్న అన్ని వర్గాల మహిళలు మన్నన్నలు పొందుతున్నారు అని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గం లో 1582 మంది అగ్రవర్ణ పేదలకు 3 విడతలుగా దాదాపు 7 కోట్ల 11 లక్షల రూపాయలు తో వారికీ ఆర్ధిక భరోసా …

Read More »

ఆయుర్వేద వైద్యంకు, ఆయుర్వేద వైద్యులుకి ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ 1970 (ఐఎంసిసి1970) ప్రకారం రాష్ట్ర, కేంద్ర జాబితాలో పేర్లు రిజిస్టర్‌ అయిన క్వాలిఫైడ్‌ ఆయుర్వేద వైద్యులు ఇస్తున్న మెడికల్‌ సర్టిఫికెట్‌/ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌లను ఈ.ఎస్‌.ఐ, టి.సి.ఎస్‌, రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీస్‌, ఇంపీకాప్స్‌ మొదలగు సంస్థలు మినహా మిగతా సంస్థలలో ఆమోదించేవారు. వీరు అల్లోపతి వైద్యులు ఇచ్చిన మెడికల్‌/ఫిట్నెస్‌ సర్టిఫికేట్‌లను మాత్రమే ఆమోదించేవారు. ఈ విషయం పై నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మరియు అనేక ఆయుర్వేద వైద్యుల సంఘాలు కేంద్ర ప్రభుత్వంకి …

Read More »