Latest News

కోవిడ్‌ విస్తరణ, నివారణా చర్యలపై సీఎంలతో ప్రధాని న‌రేంద్ర మోదీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క‌రోనా మూడో ద‌శ వ్యాప్తి నేప‌ధ్యంలో రాష్ట్రాల అప్ర‌మ‌త్త‌త‌, కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా దేశంలో కోవిడ్ విస్తరణ పరిస్థితులను ప్రజంటేషన్ ద్వారా కేంద్ర ఆరోగ్యశాఖ వివ‌రించింది. కోవిడ్‌ పరిస్ధితులపై సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా 15–18 ఏళ్ల మధ్య వారికి …

Read More »

వైభ‌వంగా వైకుంఠ ఏకాద‌శి వేడుక‌లు…

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాద‌శి వేడుక‌లు వైభ‌వంగా జ‌రిగాయి. వైష్ణ‌వాల‌యాలు తెల్ల‌వారుజాము నుంచే భ‌క్తుల ర‌ద్దీతో క‌నిపించాయి. వేంక‌టేశ్వ‌రుడిని భ‌క్తులు ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నంలో ద‌ర్శించుకుని త‌రించారు. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ దంప‌తులు తిరుమ‌ల శ్రీవారిని ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నంలో ద‌ర్శించుకున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గురువారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని 200 మంది టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు …

Read More »

జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు… : కలెక్టర్ జె. నివాస్

-భోగభాగ్యాలతో “భోగి” -సిరి సంపదలతో “మకర సంక్రాంతి” -కనువిందుగా “కనుమ” పండుగను జిల్లా ప్రజలు నిర్వహించుకోవాలి -కరోనాను దరిచేరనివ్వద్ధు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజలందరి జీవితాల్లో మకర సంక్రాంతి వెలుగులు నింపాలని,సంపదలు నిండి సుఖ సంతోషాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సిరి సంపదలతో పాటు సంతోషాన్ని తెచ్చే సంక్రాంతి’ పండుగను అందరు ఉత్సాహంగా జరుపుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు.గురువారం సాయంత్రం ఆయన …

Read More »

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్ వేంకటేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజిత్ సింగ్ నగర్ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం నుంచి పల్లకి సేవపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ పూజ కార్యక్రమాలలో  సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముక్కోటి ఏకాదశి నాడు ద్వార పూజలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. ప్రజలపై వేంకటేశుని చల్లనిచూపు ఎల్లప్పుడూ ఉంటుందని.. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు …

Read More »

ముత్యాలంపాడు శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన ద్వార పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ముత్యాలంపాడులోని శ్రీ కోదండ రామాలయంలో ఉత్తర ద్వార దర్శనం వేడుక వైభవంగా జరిగింది. సుగంధ పుష్పాలంకరణలతో దేవతామూర్తులకు చేసిన ప్రత్యేక అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ద్వార పూజలో  సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని …

Read More »

ఈ పండుగ ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వారి అతి పెద్ద పండుగ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆకాంక్షించారు. తెలుగు నాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల నేపథ్యంలో నియోజకవర్గ ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ‘సంక్రాంతి’. కష్టించి పండించిన పంట సిరి …

Read More »

ఉచిత విద్యుత్ పథకం తో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు

-రానున్న 25 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ను కొనసాగించటమే ప్రభుత్వ లక్ష్యం -వ్యవసాయానికి ఏటా దాదాపు12000 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా -ఇందుకోసం దాదాపు రూ 8400 కోట్లు సబ్సిడీ అందచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం -వ్యవసాయ అవసరాల కోసమే సెకి నుంచి విద్యుత్ కొనుగోలు ప్రతిపాదన – సెకి నుంచి విద్యుత్ కొనుగోలు ద్వారా యూనిట్ కు 1. 90 పైసలు తగ్గనున్న వ్యయం -ఏడాదికి దాదాపు రూ 3230 కోట్లు ఆదా అయ్యే అవకాశం – ఉచిత విధ్యుత్ పథకంతో …

Read More »

కోవిడ్ నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్భంధీ చ‌ర్య‌లు చేప‌ట్టాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్భంధీ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) ఎల్.శివ శంకర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ స‌మావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంట‌ర్‌ను గురువారం జాయింట్ కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు. కోవిడ్‌ మూడోద‌శ‌లో కేసుల సంఖ్య అధికంగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని, అందుకు తగిన విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో సదుపాయాలు ఉండాలని సూచించారు. గ‌తంలో రెండు …

Read More »

కోవిడ్ కేర్ సెంటర్లను సిద్ధంగా ఉంచండి…

-తక్షణమే 100 బెడ్స్ తో అందుబాటు లోకి తీసుకురండి… -వెల్కమ్ కిట్, మెడికల్ కిట్ అందించండి… -కోవిడ్ కేర్ సెంటర్ల ఇన్చార్జిలుగా నోడల్ ఆఫీసర్లు… -కలెక్టర్ జె నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు తక్షణమే పూర్తిచేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు, సదుపాయాలు, మౌలిక వసతులు తదితర అంశాలపై గురువారం జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆర్డీవోలు, సబ్ కలెక్టర్, ఎంపీడీవోలు, …

Read More »

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్…

-ట్రయేజ్ సెంటర్, ఐసియు బెడ్స్ పరిశీలించిన సబ్ కలెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వైరస్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ గురువారం నగరంలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ట్రయేజ్ సెంటర్ సెంటర్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ట్రయేజ్ సెంటర్ ను పక్కాగా నిర్వహించాలన్నారు.ట్రయేజ్ సెంటర్ లో …

Read More »