Latest News

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైయస్ జగన్‌ భేటీ…

-రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, పెండింగ్‌ సమస్యలను ప్రధానికి నివేదించిన సీఎం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైయస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సోమ‌వారం భేటీ అయ్యారు. ప్ర‌ధాని నివాసంలో సుమారు గంటసేపు జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను ప్రధానికి నివేదించిన సీఎం జ‌గ‌న్ ఈ మేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు. ప్రధానికి సీఎం నివేదించిన అంశాల్లో భాగంగా … రాష్ట్ర విభజన పర్యవసానాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయి …

Read More »

మహిళల అభివృద్ధి దేశఅభివృద్ధి కి అవసరం…

-గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ మహిళా సభ్యురాలు బాపతి భారతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఊర్మిళనగర్ లో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ మహిళా సభ్యురాలు బాపతి భారతి ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జన్మదినోత్సవ సందర్భంగా సోమవారం జాతీయ మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా విచ్చేసి సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పులామాల వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు వివిధ రంగల నుండి ఎంపిక చేసిన మహిళమణులకు …

Read More »

జిల్లాలో డా.వైఎస్సార్ రైతు భరోసా 3 వ సం.రం. 3 వ విడతగా 3,19,588 రైతులకు రూ.69.13 కోట్లు జమచేశాం..

-జల్లాలో నూతనంగా మంజూరైన 4534 మంది కౌలు రైతులకు రూ.13,500 చొప్పున రూ. 6,12,09,000/- జమ.. -8,777 మంది(పాత) కౌలు రైతులకు 2 వేలుచొప్పున రూ. 1,75,54,000/-లు జమ చేసాం.. -భూయజమానులకు రైతుభరోసా- పియం కిసాన్ కింద 3,06,277 మందికి రూ. 2 వేలు చొప్పున రూ.61.255 కోట్లు జమ చేశాం.. -రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఆర్థిక చేయూతనిస్తుంది.. -.కలెక్టరు జె.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని డా. వైఎస్ఆర్ …

Read More »

కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక భవనాలకు ఎమ్మెల్యే శంఖుస్థాపన

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు లో త్వరలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయంనకు తాత్కాలిక వసతి నిమిత్తం నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు సోమవారం శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్థానిక ఎంప్లొయీస్ కాలనీలో శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం మంజూరు ఉత్తరువులు జారీ చేసిందని, త్వరలో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందుకోసం షుమారు 70 లక్షల …

Read More »

మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం “సావిత్రిబాయి పూలే”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సావిత్రిబాయి ఫూలే  191వ జయంతి వేడుకలను నగర్ అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా సావిత్రిబాయి ఫూలే  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మహేష్ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే మహిళా సాధికారతకు నిలువెత్తు రూపంమని భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి, 1848 మే 12 న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారని. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి …

Read More »

అర్జీదారుల సంతృప్తే లక్ష్యం, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలి…

-కమిషనర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌ -ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను కూలంకుషంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచించారు. న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వ‌హించారు. కమిషనర్ తో పాటు మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ …

Read More »

52 డివిజన్ జనసేన పార్టీ ఇంచార్జ్ గా నల్లబిల్లి కనకారావు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని 52 డివిజన్ జనసేన పార్టీ ఇంచార్జ్ గా నల్లబిల్లి కనకారావు ని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కనకారావు మాట్లాడుతూ పార్టీ సేవలను గుర్తించి పదవి ఇచ్చినందుకు నగర అధ్యక్షులు పోతిన మహేష్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి నాదెండ్ల మనోహర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

జగనన్న లేఅవుట్లలోని మిగిలివున్నఇళ్ల స్థలాల్లో మెరక పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి… : ఎమ్మేల్యే డిఎన్ఆర్

కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా లబ్దిదారులకు అందించిన ఇంటి స్థలాల లే అవుట్ల పూడికకు ప్రాక్లేయిన్, టాక్టర్ ఓనర్స్ సహకరించి మేరక చేసే పూడిక పనులు త్వరగతిన పూర్తి చేయాలనీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కలిదిండి మండలంలో ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని, ప్రాక్లేయిన్, టాక్టర్స్, ఓనర్స్ లతో, సమావేశం ఎమ్మేల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కలిదిండి మండలంలోని 23 గ్రామ పంచాయతీలలో లబ్దిదారులైన అక్కచెల్లమ్మలకు ఇచ్చిన ఇంటి …

Read More »

కృష్ణాజిల్లా డీపీఆర్వోగా ఎస్‌.వి.మోహన్‌రావు నియామకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార, పౌర సంబంధాల శాఖలో నూతన సంవత్సరం ఆరంభంలో పదోన్నతుల సందడి నెలకొంది. గుడివాడ డివిజనల్‌ పౌర సంబంధాల శాఖ అధికారి (డీఎల్‌పీఆర్వో) ఐ.కాశయ్య తూర్పు గోదావరి (కాకినాడ) జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వోగానూ, విజయవాడ డీఎల్పీఆర్వో ఆర్‌.వి.ఎస్‌.రామచంద్రరావు పశ్చిమ గోదావరి జిల్లా (ఏలూరు) డీపీఆర్వోగానూ నియమితులయ్యారు. గతంలో విజయవాడ డీఎల్‌పీఆర్వోగా పనిచేస్తూ ఆ తర్వాత ప.గో.జిల్లా నరసాపురానికి బదిలీ అయి వెళ్లిన ఎస్‌.వి.మోహనరావు తిరిగి పదోన్నతిపై కృష్ణాజిల్లా (మచిలీపట్నం) డీపీఆర్వోగా రానున్నారు. విజయవాడ సమాచార …

Read More »

జాయింట్ కలెక్టరు(అభివృద్ది) వారి నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన కలెక్టరు జె. నివాస్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యం వివిధ పనులు పరిష్కారం నిమిత్తం వచ్చే ప్రజలకు, అధికారులతో సమీక్షలు నిర్వహించేందుకు అందుబాటులో ఉండే విధంగా జాయింట్ కలెక్టరు (అభివృద్ది) వారి నూతన కార్యాలయాన్ని ప్రారంభించామని కలెక్టరు జె. నివాస్ అన్నారు. శనివారం నగరంలోని బందరు రోడ్డు డివీ మేనర్ సమీపంలో జాయింట్ కలెక్టరు(అభివృద్ది) నూతన కార్యాలయాన్ని జిల్లా కలెక్టరు జె. నివాస్ జాయింట్ కలెక్టర్లు కె. మాథవీలత, ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్‌చంద్ లతో కలసి …

Read More »