-వర్చువల్‌గా పాల్గొన్న ప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో అతిపెద్ద క్లబ్‌లలో ఒకటైన రోటరీ మిడ్‌టౌన్ విజయవాడ , ఆసరా అడ్వకేట్ అసోసియేషన్ సంయుక్తంగా సామాజిక బాధ్యతగా వినియోగదారుల హక్కులపై కల్పిస్తూ శనివారం నిర్వహించిన జూమ్ యాప్ సమావేశం నిర్వహించారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం ద్వారా ప్రజలను సాధికారపరిచే కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. రోటరీ మిడ్‌టౌన్ విజయవాడ వివిధ సామాజిక సేవల కార్యకలాపాలకు ప్రసిద్ది చెందింది, రోటరీ విజయవాడ అధ్యక్షులు పార్థసారధి, ఉపాధ్యక్షులు గుడపాటి …
Read More »Latest News
కామినేని అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో కేర్ నందు అందుబాటులో అధునాతన వైద్య సేవలు…
-పలు క్లిష్టమైన కేసుల్లో విజయవంతంగా చికిత్సలు -అత్యాధునిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో మెరుగైన ఫలితాలు -మీడియా సమావేశంలో కామినేని సీవోవో డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని కామినేని హాస్పిటల్స్ గ్యాస్ట్రో విభాగంలో అధునాతన సేవలు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన నిపుణుల ఆధ్వర్యంలో స్కానింగ్ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులతో చికిత్స, శస్త్రచికిత్స, ఎండోస్కోపీ తదితర సేవలను అందిస్తున్నారు. కామినేని గ్యాస్ట్రో విభాగంలో ఇటీవల కొన్ని క్రిటికల్ కేసుల్లో విజయవంతంగా చికిత్సనందించి, పేషేంట్ల ప్రాణాలను …
Read More »అన్‌లైన్ క్లాసులను తనిఖీ చేసిన అదనపు కమిషనర్ డాక్టర్ జె.అరుణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పటమటలంక వల్లూరి సరోజని మున్సిపాల్ కార్పొరేషన్ హై స్కూల్ లో నిర్వహిస్తున్న ఆన్ లైన్ క్లాసులను శనివారం నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డాక్టర్ జె.అరుణ, ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ లోని సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని, అన్‌లైన్ లో ఉన్న పిల్లలతో మాట్లాడుతూ వీడియో & వాయిస్ క్లారిటిగా వస్తున్నది లేనిది స్వయంగా పరిశీలించారు. టీచర్స్ చెప్పిన సబ్జెక్టులు అర్థమవుతున్నది లేనిది అడిగి తెలుసుకొన్నారు. …
Read More »మాంటీసోరి మహిళా కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన బ్యాలెట్ బ్యాక్సులను పరిశీలించిన కలెక్టరు జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాలు ఎక్కువుగా కురుస్తున్నందున విజయవాడ రూరల్ మండలానికి సంబందించి మాంటీసోరి మహిళా కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన బ్యాలెట్ బ్యాక్సులను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు. జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు ఎక్కువుగా కురవడంతో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, యంపీటీసీ ఎన్నికలకు సంబందించి మాంటీసోరి మహిళా కళాశాల స్ట్రాంగ్ రూమ్ గదుల తలుపులు వద్దకు నీరు చేరడంతో రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి అనుమతి తీసుకుని నిబంధనల ప్రకారం జిల్లా …
Read More »రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రపతి పతకాన్నిఅందుకున్న వై.డి. రామారావును అభినందించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు బిస్వ భూషన్ హరిచందన్ 2018-19 సంవత్సరానికి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్రపతి బంగారు పతకాన్ని తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వై. డి. రామారావుకు శుక్రవారం రాజ్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అందచేసారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉద్యమానికి దశాబ్దానికి పైగా చేసిన విశిష్ట సేవలు అందించినందుకుగాను రామారావు కు జాతీయ స్థాయిలో ఈ ఘనత …
Read More »`కాంక్రిట్ నిర్మాణాలు మాత్రమే కాదు మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు నేటి లక్ష్యం : ప్రధాని
-గుజరాత్‌లోని పలు కీలక రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి -రైల్వేని ఒక సేవా రంగంగానే కాకుండా ఒక ఆస్తిగా అభివృద్ధి చేశాం : ప్రధాని -టైర్`2, టైర్`3 నగరాల్లోని ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి : ప్రధాని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో రైల్వేకి చెందిన పలు కీలకమైన జాతీయ ప్రాజెక్టులను 16 జులై 2021 తేదీన వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం …
Read More »గెస్ట్ లెక్చరర్ లను కాంట్రాక్టు లెక్చరర్ వ్యవస్థలో కలపాలి…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కోరిన గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ పలాస, నేటి పత్రిక ప్రజావార్త :ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ గా పని చేస్తున్న లెక్చరర్ లను కాంట్రాక్టు లెక్చరర్ లుగా పరిగణలోకి తీసుకుని వారితో కలిపేలా చూడాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కోరారు. శుక్రవారం మంత్రి కార్యాలయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కాలేజి గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని …
Read More »ఇళ్ల లేఅవుట్లు అభివృద్ధి, తదితర గృహనిర్మాణ అంశాలపై సమీక్ష…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల లేఅవుట్లలో లెవెలింగ్, అప్రోచ్ రోడ్లు నిర్మాణం, స్టోన్ ప్లాంటింగ్ పనులను జూలై నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవిలత సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విజయవాడ డివిజన్ లో ఇళ్ల లేఅవుట్లు అభివృద్ధి, తదితర గృహనిర్మాణ అంశాలపై విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ తో కలిసి సంబంధిత అధికారులతో జెసి సమీక్షించారు. ఈసందర్భంగా జెసి మాధవిలత …
Read More »ఇళ్లనిర్మాణాలకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ముందుకు రావాలి…
-ప్రతి శుక్రవారం వైఎస్ఆర్ చేయూత యూనిట్ల గ్రౌండింగ్ డే … -జగనన్న ఇళ్ళ ఎస్ హెఔ లబ్దిదారులో రుణాలు అందించేందుకు సుముఖత వ్యక్తం చేసిన బ్యాంకర్లు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో ఎస్ ఏజ్ గ్రూపులోని సభ్యులైన ఇళ్ల లబ్దిదారులు గృహాలు నిర్మించుకునేందుకు బ్యాంకర్లు రుణాలు అందించడంలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం బ్యాంకర్లు, వివిధ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు డిఆర్‌డిఏ ఎపియంలు తదితరులతో నిర్వహించిన సమావేశంలో గృహ నిర్మాణ …
Read More »వాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయండి…
-ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉపాధ్యాయులు… -విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగనిస్తూ కరోనా వాక్సిన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా రంగం లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కి కూడా ఈ నెల లో వాక్సిన్ వేయడానికి ఇప్పటికే ప్రజారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటికే …
Read More »