Breaking News

Daily Archives: May 13, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న బోండా ఉమా దంపతులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సోమవారం సెంట్రల్ నియోజకవర్గంలో సింగ్ నగర్ సెయింట్ జోన్స్ స్కూల్ నందు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు బలపరిచిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు బూత్ నెంబర్ 37 నందు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని ఏకతాటి మీద నడిపించే నాయకుడిని, శాంతి భద్రతలు కాపాడే ప్రభుత్వానికి ఓటు …

Read More »

చెదురుమదురు సంఘటనల మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతం

-సా.5 గం.కు 68.04 % పోలింగ్ నమోదు,మంగళవారం తుది % ప్రకటన -ఇప్పటి వరకూ రీపోలింగ్ కు సంబందించి ఎటు వంటి ఫిర్యాదులు లేవు -మెరుగైన ఓటర్ల జాబితాలో ఓటు మిస్పింగ్ అనే ఫిర్యాదులు రాలేదు -అదిగ సంఖ్యలో యువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు -స్ట్రాంగ్ రూమ్ లలో నిరంతర నిఘా మద్య ఓటింగ్ యంత్రాలు సురక్షితం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చెదురుమదురు సంఘటనల మినహా రాష్ట్రంలో ఎన్నికలు ఎంతో …

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ కేశినేని శ్రీనివాస్ దంపతులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), తన కుటుంబ సభ్యులతో కలిసి తూర్పు నియోజకవర్గం 29, 30 బూత్ లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట‌ర్లకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా, ఎన్నిక‌లు నిష్పాక్ష‌పాతంగా జ‌రిగేలా చూడాల‌ని ఎన్నిక‌ల అధికారుల‌ను కోరారు.

Read More »

పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కమీషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్. ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిదిలోని కృష్ణ లంక, మాచవరం, సత్యనారాయణపురం, అజిత్ సింగ్ నగర్, నున్న, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, గమపలగూడెం, విస్సన్నపేట మరియు ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ పరిదిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించి బందోబస్త్ విధులు నిర్వహిస్తున్న అధికారులను మరియు సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పలు సూచనలు సలహాలను అందించారు. పోలింగ్ కేంద్రాల వద్ద …

Read More »

భాకరాపురంలో ఓటు వేసిన సీఎం జ‌గ‌న్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం జ‌గ‌న్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. పులివెందుల భాకరాపురంలోని జయమ్మ కాలనీలో అంగన్వాడి రెండో సెంటర్లో 138 బూత్ నెంబర్ లో తమ ఓటు హక్కును వినియోగించున్నారు. ఆయ‌న‌తో ఆమె స‌తీమ‌ణి భార‌తీ కూడా ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ ఛీఫ్​ చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ అధినేత నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలిసి ఓటు వేశారు. కుటుంబంతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు ఓటు వేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరిచిపోలేనిదని అన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి అన్న చంద్రబాబు.. భవిష్యత్తును తీర్చిదిద్దేది ఎన్నికలే అని ప్రజలు …

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు – 2024 సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సతీసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన నగరంలోని స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ బూత్ నంబర్ 53లో ఆయన సతీసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో క్యూ లైన్ లో కాకుండా ముందుకు వెళ్లి ఓటు వేయాలని వరుస క్రమంలో ఉన్న ఇతర ఓటర్లు కలెక్టర్ ను కోరినప్పటికీ ఆయన …

Read More »

కిడ్నాపైన తెదేపా ఏజెంట్లను గుర్తించి విధులకు హాజరపరచడమైంది…

-రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం బోరకమందలో తెదేపాకు చెందిన ముగ్గురు ఏజెంట్లు కిడ్నాప్ అయినట్లు వచ్చిన ఆరోపణపై జిల్లా ఎన్నికల యంత్రాంగం తో పాటు పోలీసుల యంత్రాంగం వెంటనే స్పందించడం జరిగిందని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. కిడ్నాపైన తెదేపా ఏజెంట్లను పోలీసులు పీలేరులో గుర్తించి, వారిని వెంటనే విధులకు …

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేటి ఉదయం 7.30 గంటలకు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో రైల్వే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన 155- సూర్యారావుపేట పోలింగ్ స్టేషన్ లో వారు తమరు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read More »