Breaking News

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ ఛీఫ్​ చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ అధినేత నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలిసి ఓటు వేశారు. కుటుంబంతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు ఓటు వేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరిచిపోలేనిదని అన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి అన్న చంద్రబాబు.. భవిష్యత్తును తీర్చిదిద్దేది ఎన్నికలే అని ప్రజలు గుర్తించారని తెలిపారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఏపీ ఎన్నకిలపై ప్రధాని మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఏపీ ప్రజలు, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే వారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *