Breaking News

ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు – 2024 సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సతీసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన నగరంలోని స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ బూత్ నంబర్ 53లో ఆయన సతీసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో క్యూ లైన్ లో కాకుండా ముందుకు వెళ్లి ఓటు వేయాలని వరుస క్రమంలో ఉన్న ఇతర ఓటర్లు కలెక్టర్ ను కోరినప్పటికీ ఆయన స్వయంగా క్యూలైన్ లో నిలబడి ఓటువేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా విలువైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *