Breaking News

కిడ్నాపైన తెదేపా ఏజెంట్లను గుర్తించి విధులకు హాజరపరచడమైంది…

-రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం బోరకమందలో తెదేపాకు చెందిన ముగ్గురు ఏజెంట్లు కిడ్నాప్ అయినట్లు వచ్చిన ఆరోపణపై జిల్లా ఎన్నికల యంత్రాంగం తో పాటు పోలీసుల యంత్రాంగం వెంటనే స్పందించడం జరిగిందని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. కిడ్నాపైన తెదేపా ఏజెంట్లను పోలీసులు పీలేరులో గుర్తించి, వారిని వెంటనే విధులకు హాజరపరచడమైందన్నారు.

సదుం మం. బోరకమందలో 188, 189,199 కేంద్రాల తెదేపా ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారని తెదేపా జిల్లా ఇన్ ఛార్జి జగన్ మోహన్ రాజు చేసిన ఫిర్యాదు పై పోలీసులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. అసలు వారిని ఎవరు కిడ్నాప్ చేశారు అనే అంశాన్ని పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుచున్నదని, దర్యాప్తు అనంతము నిజానిజాలు తెలుస్తాయని ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *