Breaking News

Daily Archives: May 18, 2024

‘వరల్డ్‌ టెలీకమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ సొసైటీ’ దినోత్సవం 2024

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) స్థాపన & 1865లోని మొట్టమొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్ కన్వెన్షన్‌ ఒప్పందానికి గుర్తుగా, ప్రతి సంవత్సరం మే 17న ‘వరల్డ్‌ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ’ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం నేపథ్యాంశం ‘సుస్థిరాభివృద్ధి కోసం డిజిటల్ ఆవిష్కరణ’. స్థిరమైన అభివృద్ధి సాధించడంలో, డిజిటల్ అంతరాలను తగ్గించడంలో టెలికమ్యూనికేషన్స్, సమాచార సాంకేతికతలు పోషించే కీలక పాత్రను ఇది చాటి చెబుతుంది. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన క్షేత్రస్థాయి …

Read More »

చంద్రబాబును కలిసిన సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి బలపరిచిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. శనివారం హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబుని ఆత్మీయంగా కలిసిన సుజనా చౌదరి తాజా రాజకీయాలపై చర్చించారు. విజయవాడ పశ్చిమంలో జరిగిన ఎన్నిక సరళని ఆయనకు వివరించారు.

Read More »

ఉయ్యూరులో మంత్రి జోగి రమేష్‌ లోక కల్యాణార్థం విశేషంగా పూజలు

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉయ్యూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీవేణుగోపాలస్వామి, పంచ పట్టాభిరామస్వామి ఆలయాల్లో లోక కల్యాణార్థం మండల అభిషేక మహోత్సవాలు, మహాశాంతి హోమం విశేష పూజా కార్యక్రమాలను రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ శనివారం వైభవంగా నిర్వహించారు. ముందుగా మంత్రి జోగి రమేష్‌కు పాలకవర్గం, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి జోగి రమేష్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొని వేణుగోపాలస్వామి, పంచ పట్టాభి రామస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అభిషేక, మహాశాంతి …

Read More »

టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్..

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 అభ్యర్థులకు తీపికబురు చెప్పింది. త్వరలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అభ్యర్థులందరూ వెరిఫికేషన్‌కు కావల్సిన సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ త్వరలో అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామని ప్రెస్ నోట్‌లో తెలిపింది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తామని పేర్కొంది. ఇక దివ్యాంగుల కోటాలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఆహ్వానిస్తామని స్పష్టం చేసింది. డాక్యుమెంట్ …

Read More »

నో లూస్ పెట్రోల్..పెట్రోల్ బంక్ నిర్వాహకులకు పోలీస్ వారి హెచ్చరిక..!

-ఎలక్షన్ రిజల్ట్ కై అన్ని విధాల చర్యలకు సిద్దమవుతున్న ఈసి ఇబ్రహీంపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో జరుగుతున్న అల్లర్లకు చెక్ పెట్టేందుకు ఎలక్షన్ కమిషనర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే..ఐతే ఈసి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంక్ నిర్వాహకులకు మీటింగ్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎవరికీ లూస్/బాటిళ్లలో/కంటైనర్లలో కానీ ఇతర ఏ పద్ధతిలోనైనా లూస్ పెట్రోల్ అమ్మ వద్దని తెలియపరుస్తూ నోటీసులు జారీ చేసి అమలు పరిచినట్టు తెలిపారు.ఎలక్షన్ …

Read More »

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐఎండి సూచనల ప్రకారం దక్షిణ అంతర్గత తమిళనాడు & పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని, దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమై అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రేపు శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ …

Read More »

పల్నాడు జిల్లా కలెక్టర్ గా శ్రీకేశ్ లాట్కర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా కలెక్టర్ గా శ్రీకేశ్ లాట్కర్ నియమితులయ్యారు. ఈయన 2011 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన వ్యక్తి. ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ సంస్థకు, అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులుగా, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గా కూడా పని చేశారు. ప్రస్తుతం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పని చేస్తుండగా.. బదిలీపై పల్నాడుకు కలెక్టర్ గా రానున్నారు.

Read More »

భూమి పుత్రుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం సన్ ఆఫ్ ది సాయిల్ (భూమి పుత్రుడు) పుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. శుక్రవారంనాడిక్కడి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి టీ హరీశ్రావు, గాదరి బాలమల్లు, పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

పల్నాడు జిల్లా ఇన్చార్జిగా కలెక్టర్ శ్యాంప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ శివ శంకర్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు బదిలీ చేశారు. ఈనేపథ్యంలో జాయింట్ కలెక్టర్గా ఉన్న శ్యాంప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జేసీనే ఇన్ఛార్జ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.

Read More »

కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు

-ఈసారి అనుబంధ భవనంలో ఏర్పాట్లు దిల్లీ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లలో కేంద్రాలు దిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : లోక్‌సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. నూతన పార్లమెంటు భవనం వెలుపల పునరభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో అనుబంధ భవనంలో సభ్యులకు ఘన స్వాగతం లభించే అవకాశం ఉంది. అధికారిక వేడుకలకు వీలుగా నూతన పచ్చిక బయళ్లను తీర్చిదిద్దడం, విగ్రహాలను వేరేచోటకు తరలించడం, ఎంపీలు తమ వాహనాల నుంచి దిగి బ్యాటరీ వాహనాల్లోకి …

Read More »