ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉయ్యూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీవేణుగోపాలస్వామి, పంచ పట్టాభిరామస్వామి ఆలయాల్లో లోక కల్యాణార్థం మండల అభిషేక మహోత్సవాలు, మహాశాంతి హోమం విశేష పూజా కార్యక్రమాలను రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ శనివారం వైభవంగా నిర్వహించారు. ముందుగా మంత్రి జోగి రమేష్‌కు పాలకవర్గం, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి జోగి రమేష్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని వేణుగోపాలస్వామి, పంచ పట్టాభి రామస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అభిషేక, మహాశాంతి హోమాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ స్వామివారి చల్లని దీవెనలు ప్రజలం దరిపై ఉండాలని ఆకాంక్షించారు. లోక కల్యాణార్థం హోమాలు నిర్వహించారన్నారు. అనంతరం పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. ఉయ్యూరులో శనివారం పర్యటించిన మంత్రి జోగి రమేష్ పట్టణ వాసులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. దివ్యాంగులను ఆప్యాయంగా పలకరిస్తూ, చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం పార్టీ శ్రేణులతో పాటుగా అన్ని వర్గాలను కలిసి కొద్ది సేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాజులపాటి రామచంద్రరావు, మున్సిపల్ వైస్బర్మన్ సోలే సురేష్బాబు, వైఎ స్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ అబుకలాం, మండల అధ్యక్షుడు దాసే రవి, ప్రభుత్వాసుపత్రి చైర్మన్ జంపాన కొండలరావు, కౌన్సిలర్లు డాక్టర్ జంపాన పూర్ణిమ, ముడావత్ లక్ష్మి, గోన మదన్, ఎండీ బేగ్, గుంజా సుధాకర్, సర్పంచ్లు తుమ్మూరు సురే షరెడ్డి, పొనుగుమాటి బాలస్వామి, నాయకులు అబ్దుల్ సద్దాం, పొగిరి రాము, షేక్ ఖలీల్, బాజ్జీ, గెత్తం విజయ్కుమార్, సలీం బేగ్, కొండపల్లి రమేష్, దిరిశం ఇందిరా ప్రియదర్శిని, బాలి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News