Breaking News

Daily Archives: October 16, 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మ్యూజికల్ నైట్ కోసం దేవి శ్రీ ప్రసాద్ ఆహ్వానం

-ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తో కలిసి ముఖ్యమంత్రిని ఆహ్వానించిన దేవిశ్రీప్రసాద్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మర్యాదపూర్వకంగా కలిసిన సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంలను ఆహ్వానించిన దేవిశ్రీప్రసాద్. ఆయనతో పాటు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు.

Read More »

అమరావతి అభివృద్ది పనులకు డిశంబరు మాసాంతానికల్లా టెండర్లు

-రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతిలో పలు అభివృద్ది పనులకు సంబందించిన అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు మినహా మిగిలిన అన్ని పనులకు టెండర్లను డిశంబరు మాసాంతానికల్లా పిలువనున్నామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ పనులు అన్నీ ఏడాది నుండి రెండున్నర్రేళ్లలోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన …

Read More »

ఉచిత కళ్ళజోళ్ళు, మందులు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 60 డివిజన్  వాంబేకాలని మస్జిద్- ఎ- అసిరరి మసీదులో బుధవారం అయూబ్ ఖాన్ ఆద్వర్యంలో 500 మంది వృద్ధులకు కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు చేతులమీదుగా ప్రారంభించి వారికి ఉచిత కళ్ళజోళ్ళు మందులు అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-పేదలకు అత్యాధునిక పరికరాలతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు చేయడంతో పాటు కళ్లద్దాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే …

Read More »

100 మంది మహిళలకు కుట్టుమిషన్ లు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 63వ డివిజన్ రాజీవ్ నగర్ లో బుధవారం “వాసవి క్లబ్ ఇంటర్నేషనల్” వారి సౌజన్యంతో రాజీవ్ నగర్ వాసవి ఇంటర్నేషనల్ బిల్డింగ్ నందు మహిళల జీవనోపాధి నిమిత్తం 100 మంది మహిళలకు కుట్టుమిషన్ లు అందించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు మరియు అధికారులు పాల్గొన్నారు. ఈ సంద్భంగా బోండా ఉమ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోంది అని,ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని  అమలు …

Read More »

ఫ్రాన్స్,ఇటలీ పర్యటన ముగించుకుని విజయవాడ కు చేరుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్రాన్స్,ఇటలీ పర్యటన పూర్తి చేసుకుని విజయవాడ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లినప్పటికీ ఒక స్టడీ టూర్ లాగ పర్యటన కొనసాగింది.పురందేశ్వరి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా బిజెపి రాష్ట్ర కార్యాలయం చేరుకుని అందుబాటులో ఉన్న బిజెపి నేతలు తో సంస్థాగత విషయాలు పై సమీక్ష నిర్వహించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర రావు, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, బిజెపి రాష్ట్ర …

Read More »

పారదర్శకంగా ఉచిత ఇసుక

-స్థానిక అవసరాల కోసం ఎక్కడికక్కడ వెసులుబాటు -నియోజకవర్గంలో తొమ్మిది ఇసుక రీచ్ పాయింట్లు -అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అవసరమైన ఇసుక, వారికి ఆమోదయోగ్యమైన ధరతో అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. బుధవారం నాడు కంచికచర్ల మండలం పెండ్యాల -1 ఇసుక రీచ్ (కంచల స్టాక్ పాయింట్) ప్రారంభించారు. నియోజకవర్గంలో 9 ఇసుక రీచులను …

Read More »

విదేశీ విద్యాదీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న విదేశీ విద్యాదీవెన బకాయిలను కూటమి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పెట్టిన రూ. 1,778 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను క్లియర్ చేసిందని.. అంతేగానీ కక్ష సాధింపులతో విద్యార్థుల జీవితాలతో …

Read More »

ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం

-ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఆరు నూత‌న పాల‌సీలు తీసుకొచ్చాం -వ‌న్ ఫ్యామిలీ-వ‌న్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ అనే నినాదంతో ముందుకెళ‌తాం -రాష్ట్రంలో ఐదు జోన్ల‌లో ర‌త‌న్ టాటా ఇన్నోవేషన్ హ‌బ్ లు ఏర్పాటు -10 బిలియ‌న్ డాల‌ర్ల విదేశీ పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణే ధ్యేయం -ఏపీ బ్రాండ్ ఇమేజీని గ‌త ప్ర‌భుత్వం పూర్తిగా దెబ్బ‌తీసింది -సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు -20 ఉద్యోగాల కల్పన, గంజాయి-డ్రగ్స్ నివారణ, ధరల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంగం ఏర్పాటు -స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు -మీడియా సమావేశంలో సీఎం నారా …

Read More »

కేబినెట్ సమావేశం – కీలక నిర్ణయాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం – కీలక నిర్ణయాలు: 1. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రూపకల్పనకు ఆమోదం 2. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0 (2024 – 2029) ఆమోదం 3. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 (2024 – 2029) ఆమోదం 4. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0 (2024 – 2029) ఆమోదం 5. ‘ప్లగ్ అండ్ ప్లే’ ఇండస్ట్రియల్ …

Read More »

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హర్యానా పర్యటన షెడ్యూల్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు హర్యానా వెళ్లనున్నారు. పంచకులలో హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం చంఢీఘడ్ లో ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు.

Read More »