-స్థానిక అవసరాల కోసం ఎక్కడికక్కడ వెసులుబాటు
-నియోజకవర్గంలో తొమ్మిది ఇసుక రీచ్ పాయింట్లు
-అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం
-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు అవసరమైన ఇసుక, వారికి ఆమోదయోగ్యమైన ధరతో అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. బుధవారం నాడు కంచికచర్ల మండలం పెండ్యాల -1 ఇసుక రీచ్ (కంచల స్టాక్ పాయింట్) ప్రారంభించారు. నియోజకవర్గంలో 9 ఇసుక రీచులను పెండ్యాల -1,2 వేములపల్లి -1,2, కాసరబాద, పొక్కునూరు-1,2 ఉస్తేపల్లి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. టన్ను ధర 232/- లు అధికారులు పేర్కొన్నట్లు ట్రాక్టర్ ఇసుక 1040/- లు, లారీ ఇసుక 2342/- లకు లభ్యం అవుతుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ల చలవేనని తెలిపారు. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నారు అని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే సీఎం చంద్రబాబు సంక్షేమం అంటే ఏంటో చేసి చూపించారన్నారు. ప్రస్తుతం గ్రామాల అభివృద్ధికి పల్లె పండుగ పేరుతో శ్రీకారం చుట్టడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ అధికారులు, స్థానిక పార్టీ నేతలు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News