Breaking News

Monthly Archives: December 2024

డిసెంబర్ రెండో వారంలో సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన..

-పోలవరం నిర్మాణంపై అదే రోజు షెడ్యూల్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.. -పోలవరం ఆర్ & ఆర్, భూసేకరణ బకాయిలు రూ.996 కోట్ల విడుదలకు ఆదేశాలు.. -ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికీ తాగునీరందించేలా నదుల అనుసంధానం, వాటర్ పాలసీ.. -డిసెంబర్-జనవరిలో హంద్రీ-నీవా, చింతలపూడి, వెలిగొండ ప్రాజెక్టుల పనులు ప్రారంభం.. -రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి.. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికీ …

Read More »

13 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన 13 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మరియు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖామాత్యులు పి.నారాయణ మీడియాకు వివరించారు. రాష్ట్ర సమాచార పౌర సంబధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర …

Read More »

ఆర్టీసీ విలినంతరం సమస్యలు పరిష్కరానికి కార్యచరణ

-సిబ్బంది మరియు సంస్థ నిర్వహణలో ఉన్న విధివిధానాలపై రవాణా శాఖ మంత్రి సమీక్ష -ఏపీఎస్ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష -అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత నుండి అనేక సమస్యలు వెంటాడుతున్నాయని, విలినంతరం సమస్యలు పరిష్కరానికి కార్యచరణ చేయాలని, సిబ్బంది, సంస్థ నిర్వహణలో సరైన విధివిధానాలు అవలంబించాలని, అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని, ఆర్టీసీపై రుణభారం …

Read More »

బీసీ కార్పొరేషన్లకు విధులతో పాటు నిధులు కేటాయింపు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ కార్పొరేషన్లకు విధులతో పాటు నిధులూ కేటాయించామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను ఎమ్మెల్యే అరవింద్ బాబు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వెంకట గురుమూర్తి సహా బీసీ సంఘాల నాయకులు మంగళవారం కలిశారు. ఈ నెల ఆరో …

Read More »

సౌదీలో చిక్కుకున్న యువతను స్వదేశానికి తీసుకొస్తాం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది యువకులు సౌదీ అరేబియాలో చిక్కుకున్నారు. ఏజెంట్ల ద్వారా మోసపోయిన జిల్లా యువకులను తిరిగి సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఏ పీ ఎన్ ఆర్ టి విభాగం ద్వారా సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయంతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో స్థానిక జిల్లా కలెక్టరును అప్రమత్తం చేశాం. జిల్లా కలెక్టరును విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో ఈ విషయంపై సంప్రదింపులు జరపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. …

Read More »

దేశానికే తలమాణికం సెంటర్ అఫ్ ఎక్సలెన్సి, కుప్పం

-హార్టికల్చర్ హబ్ లో విదేశీయులకు శిక్షణ కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికే తలమాణికం సెంటర్ అఫ్ ఎక్సలెన్సి(సి ఓ ఈ), కుప్పం అని, ఇజ్రాయిల్ టెక్నాలజీ తో మొట్టమొదటి సారిగా కుప్పంలో ఏర్పాటు నూతన వంగడాల ప్రయోగాల్లో దూసుకెళ్తోందని ఎం ఎల్ సి కంచెర్ల శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం కుప్పం లోని హార్టికల్చర్ హబ్ లో రాష్ట్ర ప్రభుత్వం – హార్టికల్చర్ మిషన్- ఇండో ఇజ్రాయిల్ ఎంబస్సే న్యూ ఢిల్లీ వారి సహకారం తో, ఉద్యాన శాఖ లో శాస్త్రీయ సాంకేతిక …

Read More »

విరివిగా క్రీడా పోటీలు జరగాలి..

-ఫిబ్రవరి 1 నుండి 3 వరకు కాకినాడలో క్రీడ పోటీలు -ఏపీ స్టేట్ మాస్టర్స్ అధ్లెటిక్ చాంపియన్ షిప్ 2024-25 గోడపత్రిక ఆవిష్కరించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర్ట వ్యాప్తంగా క్రీడా పోటీలు విరివిగా జరగాలని క్రీడల వెైపు అన్నీ వయస్సుల వారు పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలలో ఏపీ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ వారు ఫిబ్రవరి 01 నుంచి 03 వరకు నిర్వహిస్తున్న 23 …

Read More »

రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.1 కోటి విరాళం ఇచ్చిన ఇందుపల్లికి చెందిన విజయలక్ష్మి

-తన తల్లి కోగంటి ఇందిరాదేవి పేరిట రాజధాని కోసం రూ.1 కోటి విరాళం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1 కోటి విరాళంగా అందించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఈ మేరకు చెక్కును ఇచ్చారు. ప్రస్తుతం హైదారాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో రూ.1 కోటి విరాళంగా …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమను కాంట్రాక్టు లెక్చరర్లుగా మార్పు చేసి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. శాంక్షన్డ్ పోస్టుల్లోనే తాము సంవత్సరాల తరబడి పని చేస్తున్నామని, అతి తక్కువ జీతాలతో ఇస్తూ తమ శ్రమను …

Read More »