Breaking News

Monthly Archives: April 2025

సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు

ముప్పాళ్ల/నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముప్పాళ్ల వెళ్లిన సీఎం చంద్రబాబు గురుకుల పాఠశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాల అంతా కలియదిరిగారు. వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను పరిశీలించారు. కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, సరుకుల నాణ్యతను పరిశీలించారు. భోజనం రుచిగా, నాణ్యతతో అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి సీఎం …

Read More »

ముఖ్యమంత్రి పిలుపుతో పీ4కి అనూహ్య స్పందన

-సొంత డబ్బులతో కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి ప్రసాద్ సీడ్స్ సంసిద్ధత -లిఫ్ట్ స్కీం నిర్మాణానికి రూ. 10 కోట్ల వితరణ ఇస్తామన్న ప్రసాద్ సీడ్స్ చైర్మన్ ప్రసాద్‌ -కొమ్మమూరు లిఫ్ట్‌తో కాకుమాను మండలంలో 5,315 ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ -రైతుల కోసం లిఫ్ట్ నిర్మాణానికి ముందుకు వచ్చిన ప్రసాద్ ఔదారాన్ని అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అట్టడుగున ఉన్న పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన …

Read More »

శ్రీ దుర్గమ్మకు ప్రత్యేక పుష్పార్చన

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వావసు నామ సంవత్సర వసంత నవరాత్రుల్లో ఏడవ రోజైన 05.04.2025 శనివారం శ్రీ కనక దుర్గ అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన మంత్రపూర్వకంగా జరిగింది.ఎర్ర తామర పూలు, ఎర్ర గన్నేరు పూలు, సన్న జాజులుతో నూతనంగా నిర్మించిన పూజా మండపం ( నటరాజ స్వామి ఆలయ ప్రాంగణం)లో ఉదయం 9 గంటల నుండి పుష్పార్చన వైభవంగా ప్రారంభం అయింది. శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో మంగళ వాయిధ్యాలు, వేద మంత్రాలు నడుమ ఆలయ అర్చకులు, …

Read More »

ఇంద్రకీలాద్రి క్షేత్ర పాలక ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ అష్టమి ని పురస్కరించుకొని 05.04.2025 శనివారం ఇంద్ర కీలాద్రి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం 6 గంటలనుండి శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న స్థిత క్షేత్ర పాలక శ్రీ ఆంజనేయ స్వామి కి, ఘాట్ రోడ్ లో గల ఉపాలయం లో కొలువైన స్వామి కి, శ్రీ అమ్మవారి పాత మెట్లు వద్ద గల ఆలయం లో కొలువైన …

Read More »

బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం…

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘసంస్కర్త, రాజకీయ వేత్త బాబు జగ్జీవన్ రామ్  దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ పేదవర్గాల సంక్షేమానికి ఎంతో …

Read More »

అభివృద్ధి ప‌నుల‌కు ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న‌

నందిగామ‌, నేటి పత్రిక ప్రజావార్త : బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి సంద‌ర్భంగా చంద‌ర్ల‌పాడు మండ‌లం, ముప్పాళ్ల‌లో శ‌నివారం నిర్వ‌హించిన ప్ర‌జా వేదిక కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.. ఎన్‌టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివ‌ర్యులు స‌త్య‌కుమార్ యాద‌వ్‌, ఎంపీ కేశినేని శివ‌నాథ్‌, ప్ర‌భుత్వ విప్, స్థానిక శాస‌న‌స‌భ్యులు తంగిరాల సౌమ్య త‌దిత‌రుల‌తో క‌లిసి వివిధ అభివృద్ధి ప‌నుల శంకుస్థాప‌న‌కు సంబంధించి శిలాఫ‌ల‌కాల‌ను ఆవిష్క‌రించారు. 1. రూ. 5.75 కోట్లతో వెల్ల‌టూరు గ్రామంలో ఫుట్‌వేర్ త‌యారీ యూనిట్ నిర్మాణం. నిధులు (పీఎం-ఏజేఏవై). 2. …

Read More »

ఉన్న‌తంగా ఎదిగేందుకు ప్ర‌భుత్వ భ‌రోసా

-విభిన్న ప్ర‌తిభావంతుల‌కు ఉప‌క‌ర‌ణాల‌ను అందించిన ముఖ్య‌మంత్రి నందిగామ‌, నేటి పత్రిక ప్రజావార్త : బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి సంద‌ర్భంగా చంద‌ర్ల‌పాడు మండ‌లం, ముప్పాళ్ల‌లో శ‌నివారం నిర్వ‌హించిన ప్ర‌జా వేదిక కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ‌, ఎస్‌సీ కార్పొరేష‌న్‌, విభిన్న ప్ర‌తిభావంతుల శాఖ త‌దిత‌ర శాఖ‌లు ఏర్పాటుచేసిన స్టాళ్ల‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంద‌ర్శించారు. ఎస్‌సీ కార్పొరేష‌న్ స‌బ్సిడీతో కూడిన సెర్ప్‌-ఉన్న‌తి వ‌డ్డీలేని రుణాల మంజూరుకు సంబంధించిన స్టాల్‌ను సంద‌ర్శించి.. మ‌హిళ‌ల‌తో మాట్లాడారు. మ‌హిళా సాధికార‌త దిశ‌గా ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న …

Read More »

“శ్రీరామ నవమి”

-అందరికి “శ్రీరామ నవమి” శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుత్రకామేష్టి యాగంలో దశరథ మహారాజుకి జన్మించిన తొలి సంతానమే మన రామయ్య !! పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో జరిగింది రాముని జననం.. చైత్ర శుద్ధ నవమి నాడే “శ్రీరామ నవమి”. ఆ రోజే సీతా రాముల పట్టాభిషేకము జరిగినది… సీతారాముల కళ్యాణం అన్ని రామ మందిరాలలో చాలా ఘనంగా జరుపుకుంటారు.. వడపప్పు,పానకం,చలిమిడి నైవేద్యం గా సమర్పిస్తారు.. సీతా స్వయంవరంకై రాముడు “మిథిల”వెళ్ళినాడు… శివధనస్సును అవలీలగా విరిచి, జానకి మెడలో వేసెను కళ్యాణ …

Read More »

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రామో విగ్రహవాన్ ధర్మః’ – సకల సుగుణాలు, ధర్మం, న్యాయం మూర్తీభవించితే అది సాక్షాత్ రాముని రూపమే అవుతుంది. సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధు మూర్తి శ్రీరాముడు… తిరుగులేని పరాక్రమశీలి అని శ్రీమద్వాల్మీకి రామాయణం చెబుతోంది. సత్యం, ధర్మం, న్యాయం అనేవాటిని ఒక పాలకుడు ఎంత నిబద్ధతతో పాటించాలో శ్రీరామచంద్రుడి నుంచి పాలకులు గ్రహించాలి. దశరథ తనయుడు ధర్మానికి ప్రతీక కాబట్టే… త్రేతా యుగం నుంచి నేటి కలియుగంలోనూ రామ నామం వాడవాడలా మారుమోగుతూ ఉంది. …

Read More »

గ్రామాలకు సీసీ రోడ్ల శోభ

-పవన్ కళ్యాణ్ చొరవతో మారుతున్న పిఠాపురం దశ -ఒకే రోజు రూ.3.7 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు -నూతన సీసీ రోడ్లు, డ్రెయిన్లను ప్రారంభించిన శాసన మండలి సభ్యులు నాగబాబు  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు కోట్ల 70 లక్షల రూపాయల నిధులు.. 21 అభివృద్ధి పనులు.. ఒకే రోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  చొరవతో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కాగా శాసన మండలి సభ్యులు కొణిదెల …

Read More »