Breaking News

Monthly Archives: April 2025

మే నెల 10 వ తేదీన జాతీయ లోకదాలత్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వచ్చే మే నెల 10 వ తేదీన జాతీయ లోకదాలత్ ను విజయవంతంగా నిర్వహించి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కక్షిదారులు అందరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి గోపి కోరారు. గురువారం సాయంత్రం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలో గల న్యాయ సేవా సదన్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ అధికారులు కక్షిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు …

Read More »

వ్యవసాయం, ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, జల వనరుల శాఖ, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ తదితర అంశాలపై సమీక్ష

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలవటంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, బీమా వైద్యసేవలు శాఖామంత్రి మరియు కృష్ణ జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్చార్జి మంత్రి గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ …

Read More »

ఏ ధర్మాన్ని ఆచరిస్తారని అడిగి మరీ చంపేశారు

-పెహల్గాం ఉగ్రవాద చర్యను భారత దేశం ఎన్నటికీ మరువదు -అత్యంత కిరాతకంగా, నిర్దయగా ప్రవర్తించారు -ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరి పారేయాలి -బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఇస్తుంది -ఉగ్ర దాడిలో మృతి చెందిన కావలి వాసి మధుసూదనరావు సోమిశెట్టి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -కుటుంబ సభ్యులకు ఓదార్పు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘పహల్గాంలో ఉగ్రవాదుల దాడులు దారుణం. ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా, టార్గెటెడ్ గా పర్యాటకుల్ని హతమార్చారు. …

Read More »

మతం అడిగి మరీ కాల్చి చంపారు

-పేలుడు చప్పుళ్లకు పారిపోతుంటే శాలువాలు అమ్మేవారు తప్పుదోవ పట్టించారు -పడుకుంటే కాల్చరని చెప్పారు.. నా కళ్లెదుటే నా భర్తను కాల్చేశారు -చిన్న చిన్న పిల్లలు ఉన్నవారినీ వదల్లేదు -ఉగ్రవాదులు అత్యంత నిర్ధయగా ప్రవర్తించారు -కశ్మీర్ సురక్షితంగా ఉంటుందని నమ్మి వెళ్లాం -ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ ఎదుట కన్నీటి పర్యంతమైన ఉగ్రదాడిలో హతమైన మధుసూదన రావు  సతీమణి  కామాక్షి  -మీ బాధని ఎవరూ తీర్చలేరంటూ పవన్ కళ్యాణ్ ఓదార్పు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘కశ్మీర్ సురక్షితంగా ఉంటుందనే నమ్మకంతో విహార యాత్రకు …

Read More »

ఉగ్రవాద దాడులకు హైదరాబాద్ నగర వాసులూ బాధితులే

– పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి – భారత ప్రభుత్వం కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది – పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరూ మృతి చెందిన మన తోటి భారతీయులకు భరోసానివ్వాలి – నిజాంపేట నిరసన దీక్షలో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉగ్రవాద దాడులకు హైదరాబాద్ నగర వాసులూ బాధితులేనని, ఉగ్ర దాడుల ప్రభావం, దాని పర్యవసానానికి సంబంధించి హైదరాబాద్ నగర వాసులకు అవగాహన, అనుభవం ఉన్నదని, గతంలో గోకుల్ చాట్, దిల్‍సుఖ్‍నగర్ తదితర …

Read More »

స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా మారాలి

-ఆర్థిక, రాజకీయ, సామాజిక పటుత్వం అవసరం -స్వయంప్రతిపత్తి, స్వావలంబనతో ముందుకు సాగాలి -పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు -రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు నేరుగా నిధులు -ఉపాధి కూలీలను ఇక మీదట ఉపాధి శ్రామికులుగా పిలుద్దాం -పంచాయతీల స్థలాలు, ఆస్తులు, భవనాలకు ఆడిట్ జరగాలి -ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం, స్థూపం నిర్మించేలా ప్రణాళిక -నేనెప్పుడూ గ్రామీణ మనస్తత్వం ఉన్న సగటు వ్యక్తినే -మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొని, దిశానిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ …

Read More »

పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మౌన దీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ, ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శాసన మండలిలో ప్రభుత్వ విప్  పిడుగు హరిప్రసాద్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, మృతులకు నివాళులు అర్పించి మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎం.ఎస్.ఐ.డి.సి. చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ నేతలు కళ్యాణం …

Read More »

నియోజక వర్గం అభివృద్ధి పథములో ముందుకు వెళ్ళే విధంగా పథకాలు రూపొందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర-2047 సాధనలో భాగంగా నియోజక వర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు రెండవ రోజు గురువారం యన్.టి.ఆర్. జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని పింగళి వెంకయ్య సమావేశమందిరంనందు జరిగిన వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మిషా, ఐ.ఎ.యస్. మాట్లాడుతూఅందరు నియోజక వర్గ ప్రత్యేక అధికారులు మరియి వారి టీం సభ్యులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరి కి అనుగుణంగా నియోజక వర్గం అభివృద్ధి పథములో ముందుకు వెళ్ళే విధంగా పథకాలు రూపొందించాలని సూచించారు. ప్రతి వ్యక్తి …

Read More »

టూరిజం ప్యాకేజీల‌పై ప‌ర్యాట‌కుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి..

-క‌ర‌ప‌త్రాల‌ను ఆక‌ర్ష‌ణీయంగా రూపొందించండి… -గైడ్ల నియామ‌కం, శిక్ష‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి.. -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాను ప‌ర్యాట‌క హ‌బ్‌గా తీర్చిదిద్దే క్ర‌మంలో ప‌ర్యాటకుల‌కు మ‌ధురానుభూతి మిగిల్చేలా రూపొందించిన ప్ర‌త్యేక ప్యాకేజీల‌పై ప‌ర్యాట‌కుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, ఇందుకు సంబంధించి క‌ర‌ప‌త్రాల‌ను ఆక‌ర్ష‌ణీయంగా రూపొందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. గురువారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. టూరిజం ప్యాకేజీపై ప‌ర్యాట‌క‌, ఏపీ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఏపీటీడీసీ) అధికారుల‌తో పాటు వివిద భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో …

Read More »

ఈవీఎం, వీవీప్యాట్‌ గోదాముకు పటిష్ట భద్రత..

– జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈవీఎం, వీవీప్యాట్‌ గోదాముకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ పోలీస్‌ సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల కమీషన్‌ ఆదేశాల ప్రకారం సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్‌ గోదామును గురువారం జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు తదితరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో …

Read More »