విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని పలు సమస్యలు, రాజకీయ పరిస్థితులపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో వెలగపూడి సచివాలయంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొన్ని ముఖ్య సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జగ్గయ్యపేట-ముక్త్యాల వెళ్లే రహదారికి మధ్యలో వున్న పాలేటి బ్రిడ్జి గత సంత్సరం కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతింది, దాని స్థానంలో హైలెవెల్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరారు. ముక్త్యాల- మాదిపాడు మధ్యలో …
Read More »Daily Archives: April 25, 2025
బ్రాహ్మణ సామాజికవర్గంపై ప్రభుత్వ దాష్టీకం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ సామాజికవర్గంపై దాష్టీకాలు అధికమయ్యాయని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. అటు అధికారుల నుంచి ఇటు అర్చక, పురోహితుల వరకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై కక్ష పూరితంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కావాలనే రాజకీయ కక్ష సాధింపులతో కుట్రపూరితంగా అక్రమ కేసులో …
Read More »ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం
-ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ ప్రభుత్వం, ప్రజలు మీ వెంటే.. -ప్రధాని నరేంద్రమోదీని కలిసి సంఘీభావం తెలిపిన సీఎం చంద్రబాబు -రాజధాని నిర్మాణం పనుల పున:ప్రారంభానికి ప్రధానికి ఆహ్వానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తారని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు …
Read More »మీరొచ్చాక మా సమస్యలు తీరాయి
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపిన పిఠాపురం ప్రజలు -ప్రజలతో మమేకమై వారి ఆకాంక్షలు, సమస్యలు తెలుసుకొన్న పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘మీరొచ్చాక మా సమస్యలు తీరాయి సర్.. ఇళ్ల పట్టాలు ఇప్పించి నాలుగు దశాబ్దాల మా కల నెరవేర్చారు.. మీకు చెప్పగానే మా కాలనీకి కుళాయి వచ్చింది. కాస్త ఎక్కువ సమయం నీరిస్తే మా నీటి కష్టాలు తీరినట్టే..’ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో ప్రజా స్పందన ఇది. పవన్ కళ్యాణ్ …
Read More »సంక్షేమం… అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం
-కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుంది.. ప్రజలకు ఉపయోగపడుతుంది -అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మా లక్ష్యం -పిఠాపురంలో 9 నెలల్లోనే రూ. 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టాం -పిఠాపురం ప్రజల రక్షణ మా బాధ్యత -శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదే లేదు -పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా …
Read More »అక్రమార్కులైన ఆరుగురు ప్రభుత్వ వైద్యులపై చర్యలకు ఆదేశం
-తప్పుడు హాజరు, అక్రమ వైకల్య ధృవ పత్రాల జారీ, అవినీతి, విధుల పట్ల నిర్లక్ష్యానికి పాల్పడ్డారని ఆరోపణలు -అవకతవకలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే -సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉంటూ దారితప్పి వ్యవహరించారన్న ఆరోపణలొచ్చిన ఆరుగురు ప్రభుత్వ వైద్యులపై సమగ్ర దర్యాప్తు జరిపి తగు క్రమశిక్షణా చర్యల్ని చేపట్టాలని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారంనాడు ఆదేశించారు. విధులకు హాజరు కాకుండా వచ్చినట్లు హాజరు రిజిస్టర్లో సంతకం చేయడం, సంవత్సరం …
Read More »బీసీ యువత ఉన్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రం ఆకస్మిక తనిఖీ -వంట గది, విశ్రాంతి గదుల పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి ఆదేశం -బోధనా సౌకర్యాల కల్పనపై అభ్యర్థుల సంతృప్తి -అత్యుత్తమ ఫలితాలు సాధించండి -అభ్యర్థులతో మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ యువత ఉన్నతే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. కార్పొరేట్ కు ధీటుగా సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రలో బోధనా సదుపాయలు కల్పించామన్నారు. విజయవాడలోని …
Read More »పహల్గాం హంతకులను గుర్తించి కాల్చి పారేయాలి
-పాకిస్తాన్ దుశ్చర్యను ప్రతి భారతీయుడు ఖండించాలి -కులం, మతం పేరు చెప్పి చంపడం నీచాతి నీచం -ఉగ్ర దాడిపై తీవ్రంగా స్పందించిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కశ్మీర్ లోని పహల్గాం లో దారుణ మారణకాండ సృష్టించిన ఉగ్రదాడిపై రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్రంగా స్పందించారు. పహల్గాం లో అమాయకుల ప్రాణాల ను బలిగొన్న ఉగ్రవాదులను గుర్తించి కాల్చి పారేయాలని అన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. …
Read More »రేపు ‘మత్స్యకారుల సేవలో’ పథకం ప్రారంభం
-శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు -సముద్రంలో వేట విరామ సమయంలో ఆర్ధిక సాయం -ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 అందజేత -1,29,178 కుటుంబాలకు రూ. 258 కోట్ల లబ్ది -మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సంక్షేమ పాలన సూపర్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే ఎన్నికల హామీలు ఒకొక్కటి నెరవేరుస్తూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటోంది. పింఛన్ల పెంపు నుంచి అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం …
Read More »మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత
-ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం -మైనారిటీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన గత ప్రభుత్వం -రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -ఓబిఎంఎంఎస్ వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ సమావేశపు భవనంలో రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News