Breaking News

Daily Archives: April 13, 2025

సీఎం చంద్రబాబును కలిసిన ఆత్మకూరు ఎస్సీ కుటుంబాలు

-గత ప్రభుత్వ దాష్టికాలకు గురైన కుటుంబాలకు ధైర్యం చెప్పిన సీఎం -బాధిత కుటుంబాల్లోని వారికి చేయూతనిచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దాష్టికాలకు గురైన పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, ఆత్మకూరు గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాల వారు సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో ఆదివారం సీఎంను కలిసి గత ప్రభుత్వ హయాంలో తాముపడ్డ కష్టాలను వివరించారు. 2019-24 మధ్య గ్రామంలోని …

Read More »

కొండపల్లిలో ఘనంగా సాయిబాబా వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు

-ఆలయ ప్రతిష్ట మహోత్సవాల్లో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి మున్సిపాలిటీలోని బి కాలనీ వద్ద గజరాజు చెరువు పక్కన శ్రీ సాయిబాబా వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవాల్లో  మైలవరం శాసనసభ్యులు  వసంత కృష్ణప్రసాదు ఆదివారం పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్ అక్కల రామ్మోహనరావు గాంధీ, సాయిబాబా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ శ్రీ సాయిబాబా వారి ఆలయాన్ని కొద్దిరోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసినందుకు …

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేదారేశ్వరపేట 34 వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్ ఆధ్వర్యంలో శంకర నేత్ర చికిత్సాలయ సహకారంతో ఆదివారం కేదారేశ్వరపేట లోని వెలగపూడి లక్ష్మణదత్తు పాఠశాల ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగిన ఈ శిబిరంలో సుమారు 100 మందికి కంటి …

Read More »

పశ్చిమ లోని జిల్లా పార్టీ నాయకులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం

-మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన పశ్చిమ లోని జిల్లా పార్టీ నాయకులు మరియు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం -వైసిపి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమితులైన మాజీ మంత్రి వెలంపల్లి ని దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ జిల్లా నాయకులు మరియు పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం …

Read More »

నేడు కార్పొరేషన్లు లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదు

-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు దినము అయినందున కార్పొరేషన్, ప్రధాన మరియు జోనల్ కార్యాలయాలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Read More »

నవీకరణ….ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్య…

-సుజనా అకాడమీ తో ఎస్ వి హెచ్ ఇంజనీరింగ్ కళాశాల విలీనం… -ఈ నెల 15 న ఉభయ యాజమాన్యాల ఒప్పందం… -యలమంచిలి జనార్దన రావు- దైతా మధుసూదన శాస్త్రి ఇంజనీరింగ్ కళాశాల గా నూతన ఆవిర్భావం… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మెరుగైన ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యను అందించడానికి 45 ఏళ్ల చరిత్ర గల ఎస్ వి హెచ్ ఇంజనీరింగ్ కళాశాల పునరంకితం కాబోతుంది. ఇందుకోసం సుజనా అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (సాట్స్) తో డి ఎం …

Read More »

మచిలీపట్నం అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు

-మహానగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి -అభివృద్ధికి సలహాలు, సూచనలు తెలియజేయండి -పట్టణ పుర ప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర -సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంను మహానగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించామని, ఈ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జడ్పీ కన్వెన్షన్ హాల్లో మంత్రి బంగారు బందరు సాకారం కోసం …

Read More »

టీటీడీ గోమరణాలపై భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం, మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారు…

-ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య టీటీడీ గోమరణాలపై భూమన కరుణాకరరెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆదివారం ఒక ప్రకటనలో వారి కార్యాలయంలో మాట్లాడుతూ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ పై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.’అదో నల్లరాయి.. దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందంటూ’ గతంలో …

Read More »

‘కృష్ణా నదిలో ఆది దంపతుల నదీ విహారం’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు -2025 పురస్కరించుకొని తేది. 13.04.2025 సాయంత్రం 5 గంటలకు – శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయం నుండి దేవ దేవీరిలకు పవిత్ర కృష్ణానదిలో- నదీ విహారం నిర్వహించుటకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లే ఉత్సవము ప్రారంభమైనది. వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాలు నడుమ స్వామి, అమ్మ వార్లకు నదీ విహారము నిర్వహించటకు మల్లేశ్వర స్వామి ఆలయం నుండి బయలుదేరిన బృందం మహామండపం వద్దనుండి కూచిపూడి నృత్య కళాకారులు, తప్పెట్లు, కోలాటం, భజన సంకీర్తనలతో …

Read More »

దయామయుడు అయిన క్రీస్తు చూపిన శాంతి మార్గం సమస్త మానవాళికి ఆచరణీయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్ గిరిపురం కస్తూర్బాయ్ పేట , ఫ్రెండ్ సర్కిల్ రామ్మూర్తి మరియు హేమరాజు ఆధ్వర్యంలో ధనవంతుడు బీద లాజరు నాటకము ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ  విచ్చేసి ప్రజలతో మాట్లాడుతూ భగవంతుడు ఎక్కడో వుండడు. ఆయన  కోసం వెదకకుండా ఎదుటి మనిషిలో పరమాత్మనుచూసే దృష్టిని పెంచుకొంటే, ప్రతి అంగుళంలో భగవంతుడు కనిపిస్తాడు అన్నారు. బైబిల్‌లోని లూకా సువార్తలో చెప్పబడిన ఒక ఉపమాన కథ ఆధారంగా …

Read More »