Breaking News

Daily Archives: April 13, 2025

గాయని మల్లాది స్వాతికి విశిష్ట మహిళా పురస్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరానికి చెందిన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, గాయని మల్లాది స్వాతికి 2025 సంవత్సరానికి గానూ విశిష్ట మహిళా పురస్కారం ఆమె ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బల్లెం వేణుమాధవ్ ఆర్ట్స్ థియేటర్ సంస్థ ప్రతీ ఏటా దేశంలో వివిధ రంగాలలో సేవలను అందించిన వారికి విశిష్ట మహిళా పురస్కారం అందిస్తుంది. 2025 సంవత్సరానికి గానూ స్వాతికి ఈ పురస్కారం లభించింది. శనివారం హైదరాబాద్ లోని తెలుగు చలన చిత్ర మండలి హాల్ లో …

Read More »

ప్ర‌తి ధాన్య‌పు గింజ‌నూ కొనుగోలు చేస్తాం

– అన్న‌దాత‌ల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం – ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యం అమ్ముకోవచ్చు. – ధాన్యం కొనుగోలుపై వదంతులను నమ్మవద్దు – జిల్లాలో ఇప్ప‌టికే రూ. 18.81 కోట్ల విలువైన 9,223 మెట్రిక్ ట‌న్నుల కొనుగోలు – 24 గంట‌ల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం సొమ్ము జ‌మ‌వుతోంది – జిల్లాలో ఎక్క‌డా గోనె సంచుల కొర‌త లేదు – నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను బ్లాక్ లిస్టులో పెడతాం. – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Read More »

హిందువుల మనోభావాలతో భూమన ఆటలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోట్లాది మంది హిందువుల మనోభావాలతో వైసీపీ నాయకుడు భూమన కరుణకర రెడ్డి ఆటలాడుకుంటున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. ప్రజల ఛీత్కారానికి గురైనా బుద్ధి రాలేదని, అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి చేయడానికి వెనుకాడడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల …

Read More »

భారతదేశానికే ఆదర్శంగా మంగళగిరి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం

-వంద పడకల ఆసుపత్రిని ఏడాదిలోగా పూర్తిచేస్తాం -మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల, ఆ కలను నెరవేర్చే అవకాశం దక్కింది -చినకాకాని వద్ద వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ -40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రికి అన్న ఎన్టీఆర్ శంకుస్థాపన -40 ఏళ్ల తర్వాత మంగళగిరి వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం మంగళగిరి మండలం చినకాకాని వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో ఏప్రిల్ 14వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డా.బి.‌ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలలో పాల్గొననున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు తో కలిసి పరిశీలించారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని, సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ ను పరిశీలించారు. శానిటేషన్, వాహనాల పార్కింగ్, బ్యారీకేడ్ పనులు …

Read More »

ప్రేమదాన్ మదర్ థెరిస్సా ఆశ్రమంలో వృద్దులకు, నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు మరియు దుస్తులు పంపిణి చేసిన మాజీ మంత్రి వెలంపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక గుణదలలోని ప్రేమదాన్ మదర్ థెరిస్సా ఆశ్రమంలో క్రైస్తవుల ఉపవాస ప్రార్ధనల చివరి ఆదివారం సందర్భంగా పెజ్జోనిపేట ఆర్ సి యం చర్చ్ పారిస్ కమిటీ వారి ఆధ్వర్యంలో వృద్దులకు నిర్వహించిన నిత్యావసర సరుకులు మరియు దుస్తులు పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు వృద్దులకు, నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు మరియు దుస్తులను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా ఎస్సి సెల్ల్ అధ్యక్షులు పొలిమెట్ల శరత్ …

Read More »

అంబేద్కర్ జయంతి సందర్భంగా జిఎంసి పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ రద్దు…

-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రేపు సోమవారం 14 న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి, సెలవు సందర్భంగా నగర పాలక సంస్థ లో ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్) కార్యక్రమాలను రద్దు చేయడం జరిగిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ రద్దు అంశాన్నిగమనించి సహకరించాలని …

Read More »

నిర్దేశిత సమయంలో విధులకు హాజరై పారిశుధ్య పనులను పిన్ పాయింట్ గా పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్యం కోసం శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు నిర్దేశిత సమయంలో విధులకు హాజరై పారిశుధ్య పనులను పిన్ పాయింట్ గా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. ఆదివారం ఏ.టి అగ్రహారం, చుట్టుగుంట, కే.వి.పి కాలని, లాలుపురం రోడ్డు, అరండల్ పేట మరియు శంకర్ విలాస్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత ప్రజారోగ్యాధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …

Read More »

బ‌కాయిల చెల్లింపుల‌పై మంత్రివ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోవాలి

-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన‌ర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కె.ఆర్‌.సూర్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు బకాయి పడిన రూ.25వేల కోట్ల చెల్లింపులకు సంబంధించి రాబోయే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకోవాల‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన‌ర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కె.ఆర్‌.సూర్యనారాయణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాధ‌ర‌పురంలోని కుమ్మ‌రిపాలెం సెంట‌ర్ స‌మీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఐక్యవేదిక కార్యవర్గ సమావేశం నిర్వ‌హించారు. …

Read More »

సహకార రంగంలో రెండంచెల విధానం

-బ్యాంకులు, రైతుల ప్రయోజనాలకు దోహదం -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి -ఏపీ సీసీబీఈఏ వజ్రోత్సవాల సభలో వక్తలు -ఉద్యోగులకు ఆహ్వాన సంఘం చైర్మన్‌ కె.రామకృష్ణ శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సహకార రంగ బ్యాంకుల బలోపేతం, గ్రామీణ వ్యవసాయ రంగ ప్రయోజనాల కోసం రెండంచెల విధానం(టు టైర్‌) ప్రవేశపెట్టాలని, ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని వక్తలు ఉద్ఘాటించారు. గ్రామీణ వ్యవసాయ మౌలిక సౌకర్యాల కల్పన కోసం రూ.2.50 లక్షల కోట్లు కేటాయించాలని, సహకార సూత్రాలను ఖచ్చితంగా …

Read More »