Breaking News

Daily Archives: April 21, 2025

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో అమరావతి ‘ఐ’ హాస్పిటల్ సహకారంతో గాంధీనగర్ లోని విజయవాడ చాంబర్ భవన్లో సోమవారం నిర్వహించిన ఉచిత మెగా నేత్ర వైద్య సేవా శిబిరానికి విశేష స్పందన లభిం చింది. ఈ నేత్ర వైద్యశిబిరాన్ని విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు గడ్డం బాల వెంకట రవికుమార్ ప్రారంభించారు. ఈ నేత్ర వైద్య శిబిరాన్ని హాస్పిటల్ గౌరవ అధ్యక్షుడు వావిలాల రజనీకాంతశర్మ పర్యవేక్షించారు. చాంబర్ సభ్యులు, …

Read More »

అభివృద్ధి పేరిట రైతుల భూములను పెట్టుబడిగా పెట్టి ప్రభుత్వ పెద్దల అనుచరులకు దోచిపెడతారా..!

-ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కో-ఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి పేరిట రైతుల భూములను చౌకగా తీసుకొని ప్రభుత్వ పెద్దల తమ అనుచరులకు కట్టబెట్టే విధానం రాష్ట్రంలో నడుస్తుంది అని ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కో-ఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు తెలిపారు. సోమవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుచరుడు సన్నిహితుడైన షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ అధినేత …

Read More »

నియోజకవర్గాలలో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయాలి

-వేసవికి త్రాగునీటి ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి -జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిదినాలు మరింతగా పెంచాలి -సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనలు పరిగణనలోనికి తీసుకోవాలి-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ -ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రతీ నియోజకవర్గంలో ఇసుక స్టాక్ పాయింట్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర …

Read More »

అధునాతన సౌకర్యాలతో నూతన సంక్షేమ హాస్టళ్ల నిర్మాణం

-పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ -పేద విద్యార్థుల కోసం మా ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరించేందుకు సిద్ధంగా ఉంది -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అధునాతన సౌకర్యాలతో నూతన సంక్షేమ హాస్టళ్లు నిర్మించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి …

Read More »

మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభించేందుకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం విజయవాడలోని జలవనరుల శాఖ రైతు శిక్షణా కేంద్రంలో మంత్రుల బృందం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించింది. ఈసందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమానికి వచ్చే వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగని …

Read More »

సామాజిక మాధ్యమం ‘X’ లో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. ధర్మవరం పట్టు వస్త్రాన్ని, నిమ్మలకుంట కళాకారులు రూపొందించిన శ్రీ కృష్ణుని తొలుబొమ్మను ఆయనకు బహూకరించాను. ధర్మవరం పట్టు, నిమ్మలకుంట తోలుబొమ్మల విశిష్ఠతను ఆయనకు వివరించాను. మథుర శ్రీ కృష్ణుడి ప్రతిమను ఆయన నాకు బహూకరించారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సందర్భంగా చర్చించాం. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని, అలాగే ధర్మవరం నియోజకవర్గాన్ని సందర్శించాలని ఆయనను కోరాను. దానికి …

Read More »

202 మీటర్లు పూర్తైన పోలవరం డయాఫ్రమ్ వాల్

-డయాఫ్రమ్ వాల్ తో పాటే సమాంతరంగా ఈ సి ఆర్ ఎఫ్ పనులు -2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కు సంబంధించి ఇప్పటివరకు 202 మీటర్ల నిర్మాణం పూర్తయినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాఫ్రం వాల్ జగన్ పాలనలో విధ్వంసానికి …

Read More »

పుడ‌మి త‌ల్లి రోదిస్తోంది

-ధ‌ర‌ణి మాత ఆరోగ్య ర‌క్ష‌ణ మ‌నంద‌రి స‌మిష్టి బాధ్య‌త‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాన‌వాళి సుఖ‌జీవనాభిలాష నానాటికీ పెరుగుతుండ‌టంతో త‌త్ప‌ర్య‌వ‌సానంగా నిరంత‌ర దాడుల‌కు గుర‌వుతూ స‌మ‌తుల్యం కోల్పోతూ అనునిత్యం ఆరోగ్య క్షీణ‌త‌కు గుర‌వుతున్న పుడ‌మి త‌ల్లి మౌనంగా రోదిస్తోంది. మాన‌వాళితో పాటు ల‌క్ష‌లాది ర‌కాల జంతువులు, ప‌క్షులు, మొక్క‌ల‌కు ఆశ్ర‌య‌మిచ్చే ధ‌ర‌ణి మాత బ‌ల‌హీన‌మ‌వుతూ బేల‌గా మారుతోంది. ఎల్ల‌లు లేని గ‌నుల త‌వ్వ‌కాలు, క‌నుమ‌రుగ‌వుతున్న ప‌చ్చ‌ద‌నం, మాయ‌మ‌వుతున్న జీవ‌ వైవిధ్యం, అడుగంటుతున్న భూగ‌ర్భ జ‌లాలు, క‌లుషిత‌మ‌వుతున్న న‌దీ జ‌లాలు, పెరిగిపోతున్న ఎడారీక‌ర‌ణ‌, …

Read More »

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : 48 వ డివిజన్ లో రూ 15 లక్షల నిధులతో చేపడుతున్న సీ సీ రోడ్లు, మురుగు కాలువలు, మెట్లు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. గండి మహాలక్ష్మి వీధి రోడ్డులో సీ సీ రోడ్డు, సచివాలయం కొండ ప్రాంతంలో మెట్లు కాలువలకు రూ 15 లక్షల నిధులతో శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని …

Read More »

విజ‌య‌వాడ స‌మగ్రాభివృద్దితోపాటు సుందరీకరణకు ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నాము

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో కలిసి సీసీ రోడ్లు శంకుస్థాప‌న‌ -4వ డివిజ‌న్ లో ప‌లు సీసీ రోడ్ల ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆధునీక‌ర‌ణ‌లో విజ‌య‌వాడ రూపు రేఖ‌లు మారుతున్నాయి.రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో భాగ‌మైన విజ‌య‌వాడ న‌గ‌రాన్ని మ‌రింత సుంద‌రీక‌ర‌ణగా తీర్చిదిద్దాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రజాప్ర‌తినిధులైన త‌మ‌తో పాటు, ప్ర‌భుత్వ అధికారుల‌ను ఆదేశించారు. అందులో భాగంలోనే విజ‌య‌వాడ ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మోహ‌న్, బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, …

Read More »