-నాయకులు స్పందించటం లేదు -పిఎమ్ కేఎం అధ్యక్షులు పసుపులేటి వెంకట రమణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న సేవలను స్పూర్తిగా తీసుకుని టిడిపి పార్టీకి తాము నిస్వార్థంగా ఎటువంటి పదవులు అశించకుండా పలు సేవలు చేస్తూన్నామని అయితే తమకు పార్టీ పెద్దలు తగిన తోడ్పాటు ఇవ్వకపోవటం అవేదన కలిగిస్తుందని పిఎమ్ కేఎం అధ్యక్షులు పసుపులేటి వెంకట రమణ తెలిపారు. సోమవారం గాంధీ నగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు వజ్రోత్సవ వేడుక …
Read More »Daily Archives: April 21, 2025
ఆసక్తి ఉన్నరోజువారీ వేతనంపై కార్మికులు నమోదు చేసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు చేయడానికి రోజువారీ వేతనంపై కార్మికులు అవసరమని, ఆసక్తి కల్గిన వారు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్ లో నేరుగా లేదా 08632345103 కి కాల్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడం ద్వారా నగరాన్ని స్వచ్చ గుంటూరుగా తీర్చి దిద్దుకోవాడానికి …
Read More »స్థానిక సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ కమిషనర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీల్లోని ఫిర్యాదులకు సంబంధించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. సోమవారం కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ బర్త్ అండ్ డెత్ విభాగం వద్ద పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా …
Read More »స్వచ్చ అంధ్ర స్పూర్తితో స్వచ్చ గుంటూరు సాధనకు నగర ప్రజలు కూడా పూర్తీ స్థాయిలో సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మెరుగైన పారుశుధ్య పనులు చేపట్టేలా నగర కమిషనర్ నేతృత్వంలో పటిష్ట కార్యాచరణ మేరకు కృషి జరుగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజారోగ్య విభాగానికి అవసరమైన 6 ట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇంచార్జి మేయర్ షేక్ సజిలా, శాసన సభ్యులు నసీర్ అహ్మద్, గల్లా మాధవి లతో కలిసి ప్రారంభించారు. …
Read More »ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో రైతాంగం సంతృప్తి
-ధాన్యం వివరాలు, రైతాంగం సమస్యలపై అన్నదాతలతో మంత్రి కందుల దుర్గేష్ ఆరా -రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ -ఆన్లైన్ లో ధాన్యం కొనుగోలు కోసం స్లాట్ బుకింగ్ విధానం 7337359375 వాట్సాప్ నెంబర్ -చివరి బస్తా వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో రైతాంగం సంతృప్తిని వ్యక్తం చేసిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల …
Read More »అన్నా క్యాంటీన్ లో భోజనం చేసిన జిల్లా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామా నాయుడు
-పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ లను ప్రారంభించడం పట్ల ప్రజల నుంచి ప్రశంసలను అందుకోవడం జరిగిందనీ జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి డా నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం మునిసిపల్ కార్పొరేషన్ సమీపంలోని అన్నా క్యాంటీన్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామా నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత …
Read More »జి జి హెచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం మధ్యాహ్నం ఐసోలేషన్ వార్డును పరిశీలించిన, అనంతరం మాతా శిశు సంరక్షణ వార్డు, క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు పురోగతి పై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎమ్ లక్ష్మీ సూర్య ప్రభను వివరాలు అడిగి తెలుసు కోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఐసోలేషన్ వార్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావాలని ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు ను తగిన వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసుకోవాలని కోరారు.. …
Read More »విపత్తు నివారణ కోసం ములకల లంక గ్రామం మాక్ డ్రిల్
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం / సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ శాఖ, విజయవాడ వారి ఆదేశముల మేరకు ప్రకృతి వైపరిత్యములకు సంబందించి ప్రజలకు అవగాహన కలిపించుటకు గాను ముందస్తుగా రెవెన్యూ, పోలీస్, ఫైర్, మెడికల్, పంచాయతీ, మహిళా శిశు సంక్షేమ, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, జంతు పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్, ట్రాన్స్ పోర్ట్, విమానయాన విభాగం మొదలగు శాఖలకు సంబందించిన ప్రభుత్వ సిబ్బందితో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం వారి ఆధ్వర్యములో …
Read More »“M.Sc. స్పోర్ట్స్ కోచింగ్ & పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత క్రీడా ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్, NSNIS, పటియాలా వారు 2025-26 అకడమిక్ కోసం M.Sc. స్పోర్ట్స్ కోచింగ్ (2025-27), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు (2025-26) మరియు అకడమిక్ సెషన్-2025-27 సంబంధించి స్పెషలైజేషన్‌లో ప్రవేశం కొరకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించడమైనది. ఆసక్తి గల తూర్పు గోదావరి జిల్లా వారు సంబంధిత ధ్రువపత్రాలతో మే 2వ తేదీ లోగా వెబ్ సైట్: https://www.ssc.nsnis.in/ నందు దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని వివరాల కొరకు వెబ్ సైట్: https://www.ssc.nsnis.in/ …
Read More »విభిన్న ప్రతిభావంతుల అ భివృద్ధి సంక్షేమానికి ప్రభు త్వం కట్టుబడి ఉంది.
-సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా పలు కార్యక్రమాలను వారి సంక్షేమానికి అమలు చేస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పిజి ఆర్ఎస్ సమావేశ మందిరం లో విభిన్న ప్రతిభావంతురాలు అయిన మల్లిం వెంకటేశ్వరి కి ఉమా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా రూ.8,500 విలువ చేసే వీల్ …
Read More »
Prajavartha Online Telugu News