Breaking News

స్వచ్చ అంధ్ర స్పూర్తితో స్వచ్చ గుంటూరు సాధనకు నగర ప్రజలు కూడా పూర్తీ స్థాయిలో సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మెరుగైన పారుశుధ్య పనులు చేపట్టేలా నగర కమిషనర్ నేతృత్వంలో పటిష్ట కార్యాచరణ మేరకు కృషి జరుగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజారోగ్య విభాగానికి అవసరమైన 6 ట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇంచార్జి మేయర్ షేక్ సజిలా, శాసన సభ్యులు నసీర్ అహ్మద్, గల్లా మాధవి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనుల్లో మెరుగుదల కోసం గతంలో ఉన్న 22 శానిటరీ డివిజన్లను పర్యవేక్షణ సౌలభ్యం కోసం కమిషనర్ 32 డివిజన్లుగా పెంచారన్నారు. ఆయా డివిజన్లలో చెత్త సేకరణ చేయడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 27 ట్రాక్టర్లకు తోడుగా మరో 6 ట్రాక్టర్లను కొనుగోలు చేసి ప్రజారోగ్య విభాగానికి అందించారన్నారు. స్వచ్చ అంధ్ర స్పూర్తితో స్వచ్చ గుంటూరు సాధనకు నగర ప్రజలు కూడా పూర్తీ స్థాయిలో సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *