-ధాన్యం వివరాలు, రైతాంగం సమస్యలపై అన్నదాతలతో మంత్రి కందుల దుర్గేష్ ఆరా
-రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
-ఆన్లైన్ లో ధాన్యం కొనుగోలు కోసం స్లాట్ బుకింగ్ విధానం 7337359375 వాట్సాప్ నెంబర్
-చివరి బస్తా వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం
-మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో రైతాంగం సంతృప్తిని వ్యక్తం చేసిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం ఉదయం రాజమహేంద్రవరం నుండి నిడదవోలు నియోజకవర్గం కానూరు వెళ్లే మార్గమధ్యంలో కాన్వాయ్ ఆపి స్థానిక రైతులతో స్వయంగా ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాలపై మంత్రి దుర్గేష్ ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏదైనా సమస్య వస్తే తమ దృష్టికి తేవాలని మంత్రి దుర్గేష్ రైతులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ నెంబర్ 7337359375 ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు. తమది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని, చివరి బస్తా వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతూ అధైర్య పడవద్దని, ఆరుగాలం శ్రమించే ప్రతి రైతన్నకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చారు. స్వయంగా మంత్రి దుర్గేష్ కాన్వాయ్ ఆపి తమ దగ్గరకు వచ్చి ధాన్యం వివరాలను, రైతాంగం సమస్యలను ఆరా తీయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News