ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహీతలకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ వేడుకలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ నుండి హీరో నందమూరి బాలకృష్ణకి కేంద్రం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. కళారంగంలో, …
Read More »Daily Archives: April 28, 2025
ప్రధాని మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దాం
-రాజధాని పున:నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి -సభకు తరలి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదు -అమరావతి అందరిది… రాష్ట్రానికి ఆత్మవంటిది -త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు -ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం పలకడంతో పాటు సభను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. …
Read More »దేశ భవిష్యత్ యువత చేతిలోనే
-యువతకు అవకాశాలు కల్పిస్తాం… అందిపుచ్చుకోండి -ఉద్యోగంతోనే సంతృప్తి చెందొద్దు, సంస్థలను స్థాపించే స్థాయికి ఎదగండి -2న ప్రధాని చేతుల మీదుగా రాజధాని పనుల పున:ప్రారంభం -ఇక అమరావతి అన్‌స్టాపబుల్ -సీఎం నారా చంద్రబాబు నాయుడు -విట్ వర్సిటీలో ‘వి లాంచ్‌పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్ పో’లో పాల్గొన్న సీఎం -క్యాంపస్‌లో పలు భవనాల ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని, ప్రభుత్వం కల్పించే అవకాశాలను వారు అందిపుచ్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. …
Read More »రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం
-రైతుల రిటర్న్‌బుల్ ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు -గ్రామకంఠం పరిధిలో పట్టాలేని వారికి పట్టాలు మంజూరు -అంతర్జాతీయ ఎయిర్ పోర్టుతో భూముల విలువ పెరుగుతుంది -త్యాగాలు చేసిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ కార్యక్రమమూ ఉండదు -అమరావతి రైతులతో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపుకాబోతుందని…రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలక అడుగు అవుతుందని …
Read More »ప్రజా రాజధానికి మళ్లీ ఊపిరి పోద్దాం
-అమరావతి లేకపోతే మనకు అడ్రస్ లేదు -వైసీపీ నాయకులు ప్రణాళికబద్ధంగా అమరావతిని నాశనం చేశారు -10వేల మంది కార్మికుల పొట్ట కొట్టారు -జగన్ చేసిన వినాశనం గురించి తెలిసే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారు -ప్రధాని పర్యటన విజయవంతం చేద్దాం -మంగళగిరి నియోజకవర్గం బేతపూడి గ్రామంలో నర్వ్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే …
Read More »ప్రధానమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల రెండో తేదీన ప్రధానమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జి ఏ డి ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి, శాంతిభద్రతల ఎడిజే మధుసూదన్ రెడ్డి ఐజి అశోక్ కుమార్ అయి త్రివిక్రమ్ వర్మ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ సహాయ కలెక్టర్ …
Read More »మే 2వ తేదీన ప్రధానమంత్రి పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మే 2వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయా నంద్ పేర్కొన్నారు.సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి వచ్చే ప్రజలందరూ 2వ తేది మధ్యాహ్నం 1.30 గం.లకు సభా వేదిక వద్దకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం …
Read More »ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి సహకరించండి..
-రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ -ఢిల్లీలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కలిసిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్ -ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించిన మంత్రి టి.జి భరత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అగ్రగామి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను స్థాపించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ …
Read More »ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మే 2వ తేదీన అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు అమరావతి రానున్న నేపధ్యంలో అక్కడి ఏర్పాట్లను సోమవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శాఖ కమిషనర్ వీర పాండ్యన్ , జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద చేపట్టవలసిన ఏర్పాట్లు , వీవీఐపీ లు , ప్రజలు …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి పిటీషన్ ను నిర్ణీత గడువు లోపు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే.ఖాజావలి అధికారులకు సూచించారు. సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే.ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, స్టెప్ సిఈఓ చంద్రముని ప్రజల నుండి 184 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల …
Read More »
Prajavartha Online Telugu News