మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే మే నెల రెండో తేదీన ప్రధానమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జి ఏ డి ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి, శాంతిభద్రతల ఎడిజే మధుసూదన్ రెడ్డి ఐజి అశోక్ కుమార్ అయి త్రివిక్రమ్ వర్మ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ సహాయ కలెక్టర్ శిక్షణలో ఉన్న సహాయ కలెక్టర్ ఫరీన్ జైద్ లతో కలిసి గన్నవరం విమానాశ్రయంలో విఐపి విరామశాల, కంటైనర్, హెలికాప్టర్లు దిగే ప్రదేశాలు పరిశీలించారు. అనంతరం ప్రధాన కార్యదర్శి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
తదనంతరం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విమానాశ్రయ అధికారులు జిల్లా అధికారులతో ఏర్పాట్లపై అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎస్ పి జి వారు భద్రత ఏర్పాట్లపై ఏఎస్ఎల్, సమావేశం నిర్వహిస్తారన్నారు. ఆలోగా విమానాశ్రయ భవనంలో అగ్నిమాపక యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరీక్షించాలన్నారు. ప్రధానమంత్రి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటైనర్ను విరామశాలను తనిఖీ చేయాలన్నారు. ప్రధానమంత్రి పర్యటించే సమయంలో విద్యుత్తుకు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు. గ్రీన్ రూమ్ కు ఇన్చార్జిగా ఉన్నవారు అన్ని ఏర్పాట్లు బాగా పరిశీలించాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు వారికి అప్పగించిన పనులను సజావుగా పూర్తి చేయాలన్నారు
విమానాశ్రయంలో దెబ్బతిన్న టైల్స్ ను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. హై స్పీడ్ అంతర్జాలం, అంబులెన్స్ లు అందుబాటులో సిద్ధంగా ఉండాలన్నారు. ఈ పర్యటనలో విమానాశ్రయం డైరెక్టర్ ఎం ఎల్ కె రెడ్డి, గుడివాడ, ఉయ్యూరు ఆర్టీవోలు బాలసుబ్రమణ్యం, హేలా షారోన్, ఎస్సీ సంక్షేమ ,సాధికారత అధికార షాహిద్ బాబు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఆర్టిఓ శ్రీనివాసరావు, ప్రోటోకాల్ అధికారి మోహన్ రావు, డ్వామా పీడీ శివప్రసాద్, మార్కెటింగ్ ఎడి నిత్యానందం, డిపిఓ అరుణ, డి ఐ ఓ ఫణికుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్ ఏపీఎంఐపీ పిడి విజయలక్ష్మి పలువురు తహసీల్దారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News