గుంటూరు, 2 నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస వారి తనిఖీలలో భాగంగా సోమవారం సాయంత్రం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఈవీయం లు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తనిఖీ చేసారు. ఈవీయం గోడౌన్ ను వేసిన తాళాల సీళ్ళు , సీసీ టీవి పనితీరు , అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్రత సిబ్బంది లాగ్ బుక్ ను పరిశీలించారు. ఈవీయం ల భద్రత విషయంలో రాజీపడకుండా …
Read More »Daily Archives: April 28, 2025
28 నుంచి వేసవి విజ్ఞాన శిబిరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో వేసవి సెలవులు సందర్భంగా ప్రతి ఏడాది లానే ఈ సంవత్సరం కూడా పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తారు శిబిరం ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు జరుగనుంది. ప్రతి రోజు ఉదయం 8 నుండి 11 గం,, వరకు జరుగుతుంది. ఈ శిబిరంలో వివిధ విషయాల్లో శిక్షణలు, కథలు వినుట, పుస్తక పఠనము, పుస్తక సమీక్షలు, పెద్దల నుంచి విన్న అముద్రిత కథలు …
Read More »నేడు వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆజన్మాంతం నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు పద్మభూషణ్ ‘‘వావిలాల గోపాల కృష్ణయ్య!’’ ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోశారు. తెలుగునాట మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో పేరిందేవి, నరసింహం దంపతులకు 1906 సెప్టెంబరు 17న గోపాలకృష్ణయ్య జన్మించారు. చిన్న తనం నుంచి స్వాతంత్రోద్యమంలో చురకైన పాత్ర పోషించడంతో పెద్ద చదువులకు విఘాతం కలిగింది. ఆజన్మాంతం బ్రహ్మచారిగా నిరాడంబర జీవితం గడిపిన వావిలాల ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. …
Read More »సిగ్నల్స్ అన్ని పునరుద్ధరించి ఆపరేటర్ల ను ఆదుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థలోని అన్ని విభాగాల్లో నిష్ణాతులైన టెక్నికల్ సిబ్బంది ఉన్నారని, అయితే మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ గడువు పూర్తయి వెళ్లిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడుతోందని ఏపీ ఫైబర్ నెట్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు కృష్ణమూర్తి తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ లో కాలం చెల్లిన బాక్సుల పై ప్రజలు చెల్లించని 59 రూపాయలు ఈఎంఐ / రెంటల్ చార్జీలను తక్షణమే తగ్గించాలని, రాయలసీమ ప్రాంత ఏపీ ఫైబర్ …
Read More »ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకి ప్రజలు స్వచ్చధంగా రావటానికి సిద్దంగా వున్నారు
-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) -టిడిపి పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం -ఈ సమావేశంలో స్పెషల్ అబ్జర్వర్ గా పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు -పీఎం మోదీ సభను విజయవంతం చేయాలని తీర్మానం -వెస్ట్ నుంచి 60 వేల మంది వెళ్లేందుకు ఏర్పాట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకి శంకస్థాపన చేయటానికి ప్రధానమంత్రి మోదీ విచ్చేయచున్న సందర్బంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్చందంగా తరలిరావటానికి సిద్దంగా వున్నారని విజయవాడ ఎంపి …
Read More »ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా అక్షయ పాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా అక్షయ పాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. సోమవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో కలిసి టిఫిన్ చేస్తూ మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో రూ.5కే నాణ్యమైన ఆహారం అందడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతి రోజు క్యాంటీన్లకు వచ్చే …
Read More »కార్మికులు పిన్ పాయింట్ ప్రోగ్రాం మేరకు ఇళ్ల నుండి నూరు శాతం చెత్త సేకరణ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య కార్మికులు పిన్ పాయింట్ ప్రోగ్రాం మేరకు ఇళ్ల నుండి నూరు శాతం చెత్త సేకరణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. సోమవారం కమిషనర్ గోరంట్ల, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య విభాగ కార్మికులు తమకు కేటాయించిన ఇళ్ల నుండి నూరు …
Read More »అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి విధులు కేటాయించబడిన నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలియచేశారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా విధులు కేటాయించబడిన అధికారులకు మరియు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణంలో ప్రధాన వేదిక, వివిఐపి వేదిక మరియు …
Read More »కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందించడానికి ప్రత్యేక చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ఇంజినీరింగ్ విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు నాగిపోగు నాగరాజు కుటుంబ సభ్యులు కుమారికి ఎక్స్ గ్రేషియా, మట్టి ఖర్చుల చెక్ ను వారి కుటుంబ సభ్యులకు సోమవారం కమిషనర్ చాంబర్ లో కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో మరణించిన …
Read More »గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గా కోవెలమూడి రవీంద్ర
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ 7వ మేయర్ గా టిడిపి నుండి కోవెలమూడి రవీంద్ర (34ఓట్లు) ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ప్రిసైడింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్, ఏ.భార్గవ తేజ ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల ప్రత్యేక సమావేశంకు ఎక్స్ అఫీషియో సభ్యులు కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంఎల్సీలు చంద్రగిరి ఏసురత్నం, లేళ్ళ …
Read More »
Prajavartha Online Telugu News