విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సాదారణ రకం 75 కేజీల ధాన్యం బస్తాను రూ.1725లకు, గ్రేడ్ ‘ఎ’ రకము రూ.1740లకు కొనుగోలు చేయకుండా కేవలం రూ.1570 నుంచి 1660 లోపు కొనుగోలు చేసి రైతుల కష్టార్జితాన్ని దోచుకుతింటున్నారని,ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను వెంటనే అరికట్టి రైతులకు,కౌలురైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే కాటా వేసి మిల్లులకు తోలాలని, …
Read More »Daily Archives: April 22, 2025
గోవుల మృతిపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలి
-‘హిందూ ధర్మం-గోమాత యొక్క విశిష్టత’పై సదస్సులో వక్తలు -హిందూ ధర్మ పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలం: మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హిందూ ధర్మాన్ని కాపాడటం, గోవులను సంరక్షించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసనంద సరస్వతి మండిపడ్డారు. లబ్బీపేటలోని లీలావతి కళ్యాణ మండపం నందు ‘హిందూ ధర్మం-గోమాత యొక్క విశిష్టత’పై సాధు పరిషత్ ఆధ్వర్యంలో గురువారం సదస్సు నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణంలో గోమాతకు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి …
Read More »ఓబీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలి…. : అంగిరేకుల వరప్రసాద్ యాదవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఓబీసీ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ లకు వలే ఓబీసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఓబీసి వర్గానికి చెందిన ప్రధాని మోదీ భాద్యత తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఓబీసీ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ …
Read More »ఘనంగా లిటిల్ బ్రెయిన్స్ స్కూల్ 10వ వార్షికోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, పిల్లల్లో ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు గమనించి వారిని ప్రోత్సహించడం ద్వారా వారు ఆ రంగంలో నిష్ణాతులవుతారని లిటిల్ బ్రెయిన్స్ స్కూల్ డైరెక్టర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఫణిప్రసాద్ ముక్తేవి చెప్పారు. మంగళవారం స్థానిక సున్నపుబట్టీల సెంటర్ లోని ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ కళ్యాణ మండపం) హాలులో లిటిల్ బ్రెయిన్స్ స్కూల్స్ 10వ వార్షికోత్సవం వేడుకలు (బాల వినోదం అవధులు లేని ఆనందోత్సాహం) నేపథ్యంలో ఉత్సాహంగా జరిగాయి. …
Read More »ఢిల్లీలో కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
-రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు సాయం అందించాలని కోరిన సీఎం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కేంద్ర మంత్రులతో మంగళవారం చర్చించారు. విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు…నలుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ముందుగా కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ తో భేటీ అయిన చంద్రబాబు జల్ …
Read More »సిడిపిఓ లకు సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఆరోగ్య శాఖ నుంచి స్త్రీ శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేసిన తరుణంలో, గుంటూరు మరియు పల్నాడు జిల్లాలోని సిడిపిఓ లకు సూపర్వైజర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం, గుంటూరు నందు జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో , ప్రభుత్వం వారు గర్భవతులకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు జమ బడునని, అమలులో లబ్ధిదారులకు కలిగించవలసిన అవగాహన సవివరముగా పి పి టి …
Read More »యు.పి.ఎస్.సి. విజేతలకు అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యు.పి.ఎస్.సి. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పలువురు విజేతలుగా నిలవడం సంతోషదాయకం. 11వ ర్యాంకుతో ఇ.సాయి శివాని, 15వ ర్యాంకుతో బాన్న వెంకటేష్ తొలి 20 మందిలో నిలిచారు. పిఠాపురం పట్టణానికి చెందిన చక్కా స్నేహిత్ 94వ ర్యాంకు సాధించడం ముదావహం. రావుల జయసింహారెడ్డి (46వ ర్యాంకు), శ్రవణ్ కుమార్ రెడ్డి (62వ ర్యాంకు), సాయిచైతన్య జాదవ్ (68వ ర్యాంక్), ఎన్.చేతన రెడ్డి (110 ర్యాంక్ ), చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి (119 ర్యాంక్), చల్లా పవన్ …
Read More »విద్యుత్ రంగం బలోపేతానికి తక్షణ ఆర్థిక సాయం అవసరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం బలోపేతానికి ఆర్థికంగా సాయం చేయాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కేంద్రాన్ని కోరారు. విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి హాజరైన కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యస్సో నాయక్ కు మెమోరాండాన్ని అందజేశారు. ఏపీ పెద్ద ఎత్తున పునరుత్పాదక విద్యుత్ ను ప్రోత్సహిస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల కోసం గ్రీన్ ఎనర్జీ కారిడార్ …
Read More »అపార్ట్ మెంట్లు, మాల్స్ ను తరుచూ తనిఖీ చేయాలి
-ఎన్ ఓ సి కి విరుద్ధంగా నిర్మాణాలు ఉంటే చర్యలు తప్పవు -గ్రామాల్లో, పట్టణాల్లో అగ్నిప్రమాద నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలి -కమిటీల వారితో కనీసం మూడు నెలలకు ఒక సారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. -వంగలపూడి అనిత, రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖమాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వేసవి కాలంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖమాత్యులు వంగలపూడి అనిత చెప్పారు. …
Read More »యం యస్ యం ఈల అభివృద్ధికి తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి
-ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చెన్నైలోని తమిళనాడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ఇన్‌స్టిట్యూట్‌నుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు.సూక్ష్మ, చిన్న సంస్థలకు వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమాలను అందించడంలో ఇన్‌స్టిట్యూట్ అవలంబించిన ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడానికి మరియు రాష్ట్రవ్యాప్తంగా రంగానికి సంబంధించిన ఇంక్యుబేషన్ కేంద్రాలను అభివృద్ధి చేయడంలో ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇన్నోవేషన్ వోచర్ ప్రోగ్రామ్ తీసుకున్న చొరవలను తెలుసుకోవడానికి తమిళనాడు డైరెక్టర్ ఇ డి ఐ …
Read More »
Prajavartha Online Telugu News