విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం ఓబీసీ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ లకు వలే ఓబీసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఓబీసి వర్గానికి చెందిన ప్రధాని మోదీ భాద్యత తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఓబీసీ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీదేవి యాదవ్ను నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ రాష్ట్రంలో 63 ప్రభుత్వ శాఖలలో ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ను బలోపేతం చేయడం ద్వారా బీసీ ఉద్యమం ను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. ఓబీసీ, బీసీ ఉద్యోగుల క్రిమిలేయర్ సీలింగ్ పరిమితిని తక్షణమే రూ 11 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజాన్ సింగ్, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి జి.మాధవ రావు, డిఆర్ యూసీసీ సభ్యులు క్లాకు బాల నారాయణ, మహిళ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. అంకమ్మ, ఈపిడిసీ ఏపీ కన్వీనర్ గిద్దా శ్రీనివాస నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News