Breaking News

మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చెయ్యని ఆధికారులపై చర్యలు తీసుకోవాలి… : పి.జమలయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సాదారణ రకం 75 కేజీల ధాన్యం బస్తాను రూ.1725లకు, గ్రేడ్ ‘ఎ’ రకము రూ.1740లకు కొనుగోలు చేయకుండా కేవలం రూ.1570 నుంచి 1660 లోపు కొనుగోలు చేసి రైతుల కష్టార్జితాన్ని దోచుకుతింటున్నారని,ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను వెంటనే అరికట్టి రైతులకు,కౌలురైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే కాటా వేసి మిల్లులకు తోలాలని, లారీలు అందుబాటులో లేకపోవటం వలన ఎక్కడ ధాన్యం అక్కడే నిల్వ ఉంటుందని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి నష్టపోతామెమోనని రైతాంగం ఆందోళన చెందుతున్నారన్నారు.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా సివిల్ సప్లై మేనేజర్ సతీష్ ను విజయవాడలోని వారి ఆఫీసులో కలిసి ధాన్యం అమ్ముకోవడంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. కొన్ని కొనుగోలు కేంద్రాలలో అధికారులు మిల్లర్లతో కుమ్ముక్కయి రైతుల ధాన్యాన్ని కాజేస్తున్నరన్నారు ఈ అన్యాయాలు,అక్రమాలను వెంటనే అరికట్టాలని సంఘం ప్రతినిధి బృందం వారికి వినతి పత్రాన్ని అందజేసింది. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం ,కవులూరు గ్రామంలో ఏప్రిల్ 10వ తేదీ నుండి 16వ తేదీ లోపు సుమారు 35 మంది రైతులు, కౌలురైతులకు సంబంధించిన 9లారీల (9లోడులు) ధాన్యాన్ని మద్దతు ధరలకు కాకుండా మిల్లర్ల నిర్ణయం మేరకు అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి రైతులకు, కౌలురైతులకు నష్టం చేశారన్నారు. కవులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని అధికారులు తేమశాతం ఎక్కువ ఉందని, ధాన్యం ముక్కవుతుందని రకరకాలుగా కుంటిసాకులు చెప్పి మద్దతు ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు.
కవులూరు గ్రామానికి చెందిన చిరుకూరి శ్రీనివాసరావు ధాన్యం తేమశాతం 16.4 ఉన్నప్పటికీ 380 టిక్కీలు తీసుకొని 345 టిక్కీలకు మాత్రమే డబ్బులు చెల్లించారని, మిగిలిన 40 టిక్కీల ధాన్యాన్ని అక్రమంగా కాజేశారని కొనుగోలు కేంద్రాల అధికారుల అవినీతిని వివరించారు.పైగా 380 టిక్కీలకు టిక్కీ 20 రూపాయల చొప్పున కాటాకూలీ మరియు లోడింగు ఖర్చు కింద వసూలు చేశారని చెప్పారు.
బుర్ర వెంకటేశ్వరరావు ధాన్యానికి సంబంధించి కొనుగోలు నిబంధనల కు లోబడి తేమశాతం ఉన్నప్పటికీ 447 టిక్కీలకు గాను 429 టిక్కీలకే డబ్బులు ఇచ్చారు.మిగిలిన 18 టిక్కీలకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని చెప్పారు. ఈ విధంగా 35 మంది రైతుల ధాన్యాన్ని అప్పనంగా మిల్లర్లు, కొనుగోలు కేంద్ర ఆధికారులు దోచేశారని చెప్పారు.
విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడులో కాటా వేసి సంచులలో నింపి ధాన్యం రోడ్లమీద ఉందని,లారీలు లేవని తరలించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ధాన్యాన్ని వెంటనే తీసుకు వేళ్ళాలని చెప్పినప్పటికి లారీలు అందుబాటులో లేవని చెబుతున్నారన్నారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోయి నష్టపోతామని రైతులు ఆవేదన పడుతున్నారని చెప్పారు.వెంటనే స్పందించి కవులూరు గ్రామంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పైడూరుపాడుకు వెంటనే లారీలు పంపించి కాటా వేసి నిల్వ ఉంచిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు.
ఈ విషయంపై సివిల్ సప్లై మేనేజర్ సతీష్ స్పందించి కవులూరులో జరుగుతున్న విషయాలపై తక్షణమే విచారణ జరిపిస్తానని,పైడూరుపాడుకు వెంటనే లారీలు పంపించి ధాన్యం తరలిస్తామని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కౌలురైతుల సంఘం అధ్యక్షులు బుడ్డి రమేష్ ,రైతు,కౌలురైతుల సంఘాల నాయకులు తాటికొండ రమేష్, చెరుకూరి కుటుంబరావు, చెరుకూరి శ్రీనివాసరావు, బొర్ర వెంకటేశ్వరరావు,బొర్ర శివ, గరిమెళ్ళ సాంబశివరావు,వల్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *