విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాయత్రీ నగర్ లో విభిన్నమైన నూతన రుచులతో న్యాచురల్ ఫ్రూట్ పాప్స్& ఐస్ క్రీమ్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ కొత్తదనం కోరుకునే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన ఉత్పత్తులతో ”నో స్టిక్స్ న్యాచురల్ ఫ్రూట్ అండ్ పాప్స్ పార్లర్” ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ విజయవాడ ప్రజలకు ఈ నూతన రుచులను అందించడానికి ముందుకు వచ్చిన గరికపాటి తనయ్ చౌదరికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ భిన్నమైన రుచులతో న్యాచురల్ ఫ్రూట్ పల్ప్ తో తయారైన ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు. యువ వ్యాపారవేత్తలు గరికపాటి తనయ్ చౌదరికి, పొన్నగంటి రవికుమార్, బొబ్బ శ్రీకాంత్ రెడ్డి ల వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు.
డిస్టిక్ మాస్టర్ ఫ్రాంచైజీ తనయ్ చౌదరి, ఏపీ, తెలంగాణ రీజనల్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ నో స్టిక్స్ ఉత్పత్తులు నాచురల్ ఫ్రూట్ పల్ప్ తో ఎటువంటి రసాయనాలు లేకుండా అవకాడో, జాక్ ఫ్రూట్,వాటర్ మెలన్,టెండర్ కోకోనట్, చిల్లిగువ, స్పానిష్ డిలైట్, మోజీటో మరెన్నో రకాల ఐస్ ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ ఫ్యామిలీ ప్యాక్స్ వివిధ రకాల సైజులలో అందుబాటులో ఉన్నాయన్నారు. పార్లర్ కు ప్రారంభోత్సవం చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, యార్లగడ్డ వెంకట్రావుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గరికపాటి తనయ్ చౌదరి, పొన్నగంటి రవికుమార్, బొబ్బ శ్రీకాంత్ రెడ్డి, గరికపాటి గణేష్, గరికపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News