-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. …
Read More »Daily Archives: April 28, 2025
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి ఎంపీ కేశినేని చిన్నికి లేదు
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యలు అర్ధరహితమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల కాలంలో దాదాపు రూ. లక్షన్నర కోట్ల అప్పులు చేసి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నింటిలోనూ దోపిడీ పెరిగిపోయిందన్నారు. అదే వైసీపీ ప్రభుత్వం …
Read More »ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపుచే పంటల ధ్వంసం… రైతు దుర్మరణంపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష
-పవన్ కల్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపుల మూలంగా పంటలు ధ్వంసం కావడం, కొందరు రైతులు దుర్మరణం పాలవుతున్న ఘటనలు చోటు చేసుకొంటున్న క్రమంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవలే తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లులో ఒక కౌలు రైతు ఏనుగుల దాడిలో చనిపోవడం, తాజాగా పాకాల మండలం గానుగపెంటలో పంటలు …
Read More »రక్షణ మరియు క్షిపణి పరికరాల తయారీలో అగ్రగామిగా నిలవనున్న ఆంధ్రప్రదేశ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర విధానం, వ్యూహాత్మక చర్యల ద్వారా విమానయాన మరియు రక్షణ తయారీకి ఒక ప్రధాన కేంద్రంగా మారాలనే దృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుందన్న పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి, N.యువరాజ్. రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో రక్షణ, క్షిపణి విధానం, పారిశ్రామిక క్లస్టర్ల రూపకల్పన కోసం పారిశ్రామిక భాగస్వాములతో సోమవారం విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్ లో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2025-2029 …
Read More »అమరావతిని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-అమరావతె రాష్ట్ర రాజధాని-రైతులను మోసం చేసిన గత ప్రభుత్వం- -బేతపూడి రచ్చబండలో మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో రామాలయం సెంటర్ వద్ద రవి చెట్టు కింద జనసేన పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మరియు మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. రచ్చబండలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “జనసేన పార్టీ ఇప్పుడు ప్రశ్నించే పార్టీగా మాత్రమే కాకుండా సమస్యలను …
Read More »ప్రధాని సభ ఏర్పాట్లపై మంత్రులు అధికారులతో సమీక్ష
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల 2 వ తేదీన ప్రధానమంత్రి పాల్గొనే అమరావతి రాజధాని పునః నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి 5 లక్షల మంది వస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి కార్మిక రాష్ట్ర కార్మిక కర్మాగారాలు బాయిలర్లు బీమా వైద్య సేవల శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మే 2 న ప్రధాని నరేంద్రమోదీ వస్తున్న క్రమంలో.. ప్రధాని సభకు వచ్చే ప్రజలకు …
Read More »బందరు ఓడరేవు నిర్మాణం పనులను పరిశీలన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం వాసుల చిరకాల వాంఛ పోర్టు నిర్మాణమని, సకాలంలో పూర్తి చేసి మచిలీపట్నం వాసులకు పోర్టును అంకితం చేస్తామని రాష్ట్ర రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర,. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రాష్ట్ర మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య …
Read More »కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి
-రూ.30 వేల కోట్లతో సంక్షేమ పెన్షన్లు -దశల వారీగా హామీలు అన్నీ అమలు చేస్తాం -కరెంట్ కష్టాలు తీర్చడానికి సబ్ స్టేషన్ల నిర్మాణం -రాజధాని లేకుండా చేసిన వైసీపీ.., రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసింది -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కందుకూరు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి ప్రభుత్వమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కందుకూరు నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఆయన., ఉలవపాడు మండలం మన్నేటికోటలో సుమారు రూ.4 కోట్లతో నిర్మించే 33-11కేవీ …
Read More »మోడీ పర్యటన నేపథ్యంలో మంత్రి గొట్టిపాటికి కీలక బాధ్యతలు
-మంగళగిరి మీదగా వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్ల బాధ్యతను మంత్రి గొట్టిపాటికి అప్పగింత -మంగళగిరి పార్టీ ఆఫీసులో కూటమి నాయకులతో మంత్రి గొట్టిపాటి సమావేశం మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై బిజెపి, జనసేన నాయకులతో కలిసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గం మీదగా సభకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ను తెలుగుదేశం అధిష్టానం మంత్రి గొట్టపాటి రవికుమార్ …
Read More »ఉగ్రదాడిని ప్రతిఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి
– పర్యాటకులపై దాడిచేసి ప్రాణాలు తీయడం అమానుషం – ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపేందుకే కొవ్వొత్తుల ర్యాలీ – ఎన్ జి జి ఒ నేతలు డిఎస్ఎన్ .రెడ్డి పి. రమేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జమ్మూకాశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడిని ప్రతిఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని, అమాయకులైన పర్యాటకులపై దాడిచేసి ప్రాణాలు తీయడం అమానుషమని ఎపి ఎన్ జి ఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి. సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి పి. రమేష్ లు అన్నారు. ఉగ్రదాడిలో …
Read More »
Prajavartha Online Telugu News