విభిన్న ప్రతిభావంతుల అ భివృద్ధి సంక్షేమానికి ప్రభు త్వం కట్టుబడి ఉంది.

-సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా పలు కార్యక్రమాలను వారి సంక్షేమానికి అమలు చేస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పిజి ఆర్ఎస్ సమావేశ మందిరం లో విభిన్న ప్రతిభావంతురాలు అయిన మల్లిం వెంకటేశ్వరి కి ఉమా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా రూ.8,500 విలువ చేసే వీల్ కుర్చీ పంపిణీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేసీ చిన్న రాముడు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల స్వతంత్రతను, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి విద్యను అభ్యసించేందుకు, వారి కాళ్ళపై వారు ఆర్థికంగా నిలబడడం కోసం ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఉప కరణాల పంపిణీ ద్వారా వారికి అవసరమైన సహాయక పరికరాలను అందించడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ టీ సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *