డి.ఆర్.సి. లో చర్చించిన అంశాలపై సమగ్ర నివేదిక అందచెయ్యండి

-తదుపరి సమావేశంలో ప్రతి చర్య పై నివేదిక అందచేయాలి
-ప్రతిపాదనలు పంపే క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టిలో ఆయా అంశాలు తెలియ చేయాలి
-వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా విధానం ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలి
-ఇరిగేషన్ ప్రాజెక్టుల కార్యకలాపాలు మరియు నిర్వహణ(O &M) పై సమగ్ర నివేదిక అంద చేయాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పేదరిక నిర్మూలన కోసం పి-4 ను కోఆర్డినేట్ చేయడానికి ప్రతి నియోజకవర్గం లో 5 సభ్యులను నియమిస్తున్నామని, అర్హులని గుర్తించడం లో వారి జాబితా రూపకల్పన విషయంలో ఎటువంటి అలక్ష్యం లేకుండా చూడాలని జిల్లా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామా నాయుడు అధికారులను ఆదేశించడం జరిగింది.

స్థానిక కలెక్టరేట్ లో సోమవారం సాయంత్రం జిల్లా సమీక్ష సమావేశం జిల్జా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామా నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ , జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి , ఆదిరెడ్డి శ్రీనివాసు, బత్తుల బలరామ కృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, జ్యోతుల నెహ్రూ, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, ఎస్పీ డి నరసింహా కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామా నాయుడు మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక ను వరదల సమయంలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అందించేలా, ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం, ఆమేరకు ప్రజా ప్రతినిధులు నుంచి ప్రతిపాదనలు తీసుకొని వాటిని అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల కార్యకలాపాలు మరియు నిర్వహణ(O &M) పై సమగ్ర నివేదిక అంద చేయాలనీ, ఆయా పనుల నిర్వహణ మార్చి వరకు నిర్వహించేలా సంబంధిత ఏజెన్సీస్ జవాబుదారీతనం కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బంగారు కుటుంబం డేటా వివరాలు స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా నిర్ధారణ చేసుకుని, అర్హులైన వారికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరేలా చూడాలని జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు.

ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాకి నిర్దేశించిన 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాల్ని మరో లక్ష మెట్రిక్ టన్నుల మేరకు పెంచాలని రైతుల విజ్ఞప్తి చేస్తున్నారని, ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వారిని కోరామన్నారు.

బంగారు కుటుంబం డేటా వివరాలు స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా నిర్ధారణ చేసుకుని, అర్హులైన వారికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరేలా చూడాలని జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు. 20 శాతం మంది పేదల గుర్తింపు జాబితా స్థానిక ప్రజా ప్రతినిధులు కు అందచేయాలని పేర్కొన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టు ల నిర్వహణ కు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, వేసవిలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాము. ఆయా పనులు ప్రతిపాదించే క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ద్వారా వాటిని నిర్ధారణ చేసుకుని మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విద్యావ్యవస్థలో నారాలోకేష్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకోస్తున్నారని, పిల్లులు చదువులకి దూరం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నదే మానవ వనరులు శాఖామంత్రి నారా లోకేష్ ఆలోచన అన్నారు. ఆ విధానంలో చర్యలు తీసుకోవాలన్నారు.

గౌరవ శాసన సభ్యులు ప్రతిపాదించిన అంశాలకి, పనులకు సంబంధించి సమావేశంలో మినిటైజ్ చెయ్యాలని, ఆయా అంశాలపై తదుపరి జిల్లా సమీక్షా సమావేశం నాటికి యాక్షన్ టేకెన్ నివేదిక అందచేయాలని ఆదేశించారు.

రబీ సీజన్ మరింత సమర్థవంతంగా ధాన్యం సేకరణ చేపట్టాలని, గతంలో ఖరీఫ్ సీజన్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేకరణ చేయడం జరిగిందని జిల్లా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు. 126 రకం ధాన్యం కు మంచి ధర లభిస్తోంది, ఈ పంట 135 రోజుల్లో. కోతకు రానున్నట్లు తెలియ చేశారు.

రానున్న వర్షాకాలం దృష్ట్యా ఇసుక సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.

ఇసుక రిచెస్ వద్ద అనధికార లావాదేవీలు లేకుండా చూడాలని సూచించారు. ప్రతి నియోజక వర్గంలో ఒక సాండ్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు.  సెమీ మెక్స్నైజ్డ్ యంత్ర పరికరాలు ద్వారా ఇసుక త్రవ్వకాలు జరిపితే రేట్ బాగా తగ్గుతుందనీ మంత్రి స్పష్టం చేశారు. ఉచిత ఇసుక సరఫరా విధానం మరింత విజిలెన్స్ పెంచడం పై దృష్టి సారించాలని ఆదేశించారు.  సెప్టెంబరు నెలాఖరు వరకు ఇసుక సరఫరా లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.జిల్లాలో ఇసుజ త్రవ్వకాలు కోసం గుర్తించిన ఏజెన్సీస్ లకే స్టాక్ పాయింట్లు నిర్వహణ బాధ్యత అప్పగించడం జరిగిందన్నారు. ప్రతి నియోజక వర్గం పరిథిలో రెండు చొప్పున స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

గోకవరం మండలం ప్రతి గ్రామంలో త్రాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మల రామా నాయుడు ఆదేశించారు. అందుకు సంబంధించిన సి డబ్ల్యు ఎస్ స్కీమ్, ఇట్టా పథకాలను అనుసరించి, స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయాలు పరస్పరం తెలుసుకుని వాటిని సరైన విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ను 2027 వరకు పొడిగించడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో కేంద్రం నుంచి మరింత నిధుల్ని తీసుకుని వొచ్చే అవకాశం ఉందని మంత్రి నిమ్మల రామా నాయుడు పేర్కొనడం జరిగింది.

వృథాగా ఉన్న ఇరిగేషన్ స్థలాలు ఆక్రమణ లకి గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ప్రాజెక్టు ల నిర్వహణ వ్యవస్థ పటిష్టం చెయ్యాలని ప్రజా ప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకుని రావడం జరిగింది. నిడదవోలు.. శెట్టి పేట వద్ద రైల్వే ప్రాజెక్ట్ సంబంధించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని తెలియ చేశారు.

చెరువులు పూడిక తీత కు సంబంధించి జీవో జారీ చేయడం జరుగుతుందని మంత్రి రామా నాయుడు తెలిపారు.

గోపాలపురం నియోజక వర్గం పరిథిలో మైనర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి క్షేత్ర స్థాయిలో హేతుబద్ధత కలిగిన సర్వే చేపట్టడం జరుగలేదని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలియజేశారు.  ఇటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేసినపుడు స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయం తెలుసుకోవడం జరగాలని పేర్కొన్నారు. ఓ అండ్ ఎమ్ కి, డిసిల్టేషన్ కి చెందిన పనులు చేపట్టడం జరుగుతోందని ఇన్చార్జి మంత్రి తెలిపారు.  ప్రతిపాదించిన పనులకు సంబంధించి సరైన విధంగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. గతంలో ప్రతిపాదించిన పనులకు సంబంధించి నిధుల కేటాయింపు సహేతుకంగా లేక పోవడం తో అదనపు నిధులు విడుదల చేయాలని సిఫార్సు చెయ్యడం జరిగిందని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పూర్తి చెయ్యడం కోసం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.

మన బడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా డి ముప్పవరం స్కూలు ను వేరొక ప్రాంతంలోకి మార్చడం జరుగుతోందని, ఇది ఇబ్బంది కరంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ సమావేశం దృష్టికి తీసుకుని రావడం జరిగింది. జాతీయ విద్యా విధానం ప్రకారం హేతుబద్ధీకరణ ప్రక్రియను అనుసరించి స్కూలు మార్చడం జరుగుతోందని ఇది కొంత ఇబ్బంది కరంగా ఉందని ఎంపి దగ్గుబాటి పురంధేశ్వరి తెలియ చేశారు. జిల్లాలో ఒక్క స్కూలు, అంగన్వాడీ కూడా మూసి వెయ్యలేదనీ కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మోడల్ స్కూలు వలన విద్యా వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని తెలిపారు.

ఇటీవల గోదావరి నదిలో మునిగి మరణాలు సంభవించడం దురదృష్టకరమన్నారు. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీ పురందేశ్వరి సూచించారు.  10 వ తరగతి, ఇంటర్ విద్యార్థులు మృతి చెందడం జరిగిందని, స్కూలు, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాల ఉత్పత్తులు పాడై పోవడం గుర్తించామని ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ సమావేశం దృష్టికి తీసుకుని రావడం జరిగింది. వీటిపై పాలను సరఫరా చేసిన వారి నుంచి వివరణ కోరాలని ఇన్చార్జి మంత్రి ఆదేశించారు. ఆమేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *