అర్జీల పై ప్రత్యేక ప్రత్యేక శ్రద్ధ చూపాలి

-ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 372 అర్జీలు
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) కు వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో, వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపిడిఓ లు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీ జి ఆర్ ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలి అని, పెండింగ్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టీ త్వరిత గతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డి ఆర్ ఓ నరసింహులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి,ఆన్లైన్ నమోదుతో సిబ్బందికి రసీదులు అందించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు : రెవెన్యూ -260, పౌర సరఫరాల శాఖ – 4, పోలీస్- 13, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ -10, స్కిల్ డెవలప్మెంట్ -1, ఐటిఐ -2, పంచాయితీ రాజ్ – 21, కో ఆపరేటివ్ సొసైటీ – 1, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ – 1, రూరల్ డెవలప్మెంట్ – 7, ఎండోమెంట్ -3, స్కూల్ ఎడ్యుకేషన్ – 7, రూరల్ పావర్టీ – 7, BSNL – 1, ఎస్ వి మెడికల్ కాలేజ్ – 1, ఎస్ సి కార్పొరేషన్ – 2, బిసి కార్పొరేషన్ – 2, జాతీయ రహదారులు – 4, టిటిడి -2, హార్టికల్చర్ -1 సర్వే -9, ఐ సి డి ఎస్- 2, అటవీ శాఖ – 1, రిజిస్ట్రేషన్ శాఖ- 2, నీటి వనరుల శాఖ -2, పబ్లిక్ హెల్త్ – 2, ఏపీఐఐసీ – 2, గనుల శాఖ – 1, ఆర్టీసీ -1 మొత్తం 372 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *