Breaking News

ప్రపంచ మలేరియా దినోత్సవం పోస్టర్స్, బ్యానర్స్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్ నెల 25 వ తేదీన జరుగనున్న ప్రపంచ మలేరియా దినోత్సవం పోస్టర్స్, బ్యానర్స్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాల కృష్ణ నాయక్ తో కలిసి ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు అని అన్నారు. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం అని తెలిపారు. ప్రజలంతా మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దోమలు వ్యాపి చెందకుండా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి పరిసరాలలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు అని అన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప్ కుమార్,Dchs Dr ఆనంద మూర్తి, వైద్యాధికారి Dr అభిజ్ఞ,శ్రీ బాబూ నెహ్రూ రెడ్డి హెచ్యిఓ, మరియు సబ్ యూనిట్ అధికారులు, మలేరియా ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *