Breaking News

ఆసక్తి ఉన్నరోజువారీ వేతనంపై కార్మికులు నమోదు చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు చేయడానికి రోజువారీ వేతనంపై కార్మికులు అవసరమని, ఆసక్తి కల్గిన వారు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్ లో నేరుగా లేదా 08632345103 కి కాల్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడం ద్వారా నగరాన్ని స్వచ్చ గుంటూరుగా తీర్చి దిద్దుకోవాడానికి ప్రస్తుతం ఉన్న కార్మికులకు అదనంగా కార్మికులు అవసరమన్నారు. కనుక రోజువారీ వేతనంపై కేటాయించిన ప్రాంతాల్లో కేటాయించిన పారిశుధ్య పనులు చేయడానికి ఆసక్తి ఉన్నవారు వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *