Breaking News

అధునాతన సౌకర్యాలతో నూతన సంక్షేమ హాస్టళ్ల నిర్మాణం

-పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ
-పేద విద్యార్థుల కోసం మా ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరించేందుకు సిద్ధంగా ఉంది
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అధునాతన సౌకర్యాలతో నూతన సంక్షేమ హాస్టళ్లు నిర్మించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి డోలా సమీక్షా సమావేశం నిర్వహించారు. హాస్టళ్ల మరమ్మతులు, కొత్త హాస్టళ్ల నిర్మాణంపై అధికారులతో చర్చించారు, డిజైన్లు పరిశీలించి చర్చించి పలు డిజైన్లు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…అధునాతన సౌకర్యాలతో హాస్టళ్ల భవనాలు నిర్మించాలి. కొత్తగా నిర్మించే ప్రతి హాస్టల్లో రీడింగ్ రూమ్, జిమ్, ఎయిర్ వెంటిలేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది నవంబర్ లోపు హాస్టళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పేద విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. ఎం నాయక్, ఏపీ, ఎస్. ఐడిసి ఎండీ దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు ఉదయం సచివాలయంలోనే మన్య్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కుల ధ్రువీకరణ పత్రాల అప్పీల్లపై హియరింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. జిల్లా స్థాయి స్క్రూటీని కమిటీలో సహేతుకంగా, సమగ్రమైన, నిష్పక్షపాత విచారణ చేయాలన్నారు. తప్పుడు ధ్రువీకరణాలు పత్రాలు జారీచేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *