Breaking News

మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభించేందుకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం విజయవాడలోని జలవనరుల శాఖ రైతు శిక్షణా కేంద్రంలో మంత్రుల బృందం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించింది. ఈసందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమానికి వచ్చే వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో ముఖ్యంగా ఆహారం,తాగునీరు వంటి వసతుల కల్పనలో ఎంత మాత్రం రాజీ పడరాదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రధాని సభా ప్రాంగణానికి చేరుకునే రహదారులను మెరుగుపరచాలని మంత్రి కేశవ్ అధికారులకు స్పష్టం చేశారు.

రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ ప్రధాని పర్యటన రోజు ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలని పోలీస్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు.ప్రధాని సభకు వచ్చే సామాన్య ప్రజలకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో తాగునీరు, ఆహారం వంటి సౌకర్యాలు కల్పించడంలో ఏమాత్రం రాజీ పడవద్దని స్పష్టం చేశారు. వరకూ చాలా గ్రామీణ రహదారులై ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.గతంలో చిలకలూరిపేట,విశాఖపట్నం లలో ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన చిన్న చిన్న పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రధాని సభను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ టెంటటివ్ కార్యక్రమం ప్రకారం మే 2వ తేది మధ్యాహ్నం 3గం.లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని అక్కడ నుండి హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయం సమీపంలోని హెలీఫ్యాడ్ కు చేరుకుని అక్కడ నుండి రోడ్డు షో ద్వారా సచివాలయం వెనుక వైపున గల ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు. ఈకార్యమానికి సంబంధించి విధులు కేటాయించిన అధికారులు వారి టీంలతో కలిసి ఆయా పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవాలని చెప్పారు. ఈకార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఇతర ఏవిధమైన సమస్యలున్నా నోడలు అధికారి వీరపాండ్యన్ తో సమన్వయం చేసుకుని వాటిని పరిష్కరించుకోవాలని చెప్పారు.

ప్రధానమంత్రి కార్యక్రమాల పర్యవేక్షణ నోడలు అధికారి వీరపాండ్యన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రధాని పర్యటన ఏర్పాట్లను వివరిస్తూ టెంటటివివ్ కార్యక్రమం ప్రకారం మే 2వ తేది మధ్యాహ్నం 3గం.లకు ప్రధాన మంత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని వివరించారు. తదుపరి హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయం వద్ద గల హెలీఫ్యాడ్ కు 3.20గం.లకు చేరుకుంటారని తెలిపారు. అనంతరం అక్కడ నుండి ప్రధాన వేదిక వరకు సుమారు 1.2 కి.మీల పొడవునా రోడ్డు షో నిర్వహిస్తారని వివరించారు.రోడ్డుషోలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.అంతేగాక సాంస్కృతిక బృందాల ప్రదర్ళన ద్వారా స్వాగతం పలుకుతారని పేర్కోన్నారు.3.35గం.లకు సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరావతి ఫెవిలియన్ కు చేరుకుంటారని తదుపరి 3.45గం.లకు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని వివరించారు. సాయంత్రం 5గం.ల ప్రాంతంలో ప్రధాని హెలీఫ్యాడ్ కు చేరుకుని హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని విమానంలో బయలుదేరి వెళతారని అన్నారు.మొత్తం మీద సుమారు రెండు గంటల పాటు సాగే ప్రధాని పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

ప్రధాని పర్యటనకు సంబంధించి 10 పార్కింగ్
స్థలాలను ఏర్పాటు చేసి అక్కడ తాగునీరు తదితర ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.వివిఐపిలకు కరకట్ట, సీడ్ యాక్సిస్ రోడ్లను ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అంతేగాక సామాన్య ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు వీలుగా విజయవాడ నుండి మరో రెండు రూట్లు,గుంటూరు నుండి నాలుగు రూట్లను, మరికొన్ని తాత్కాలిక రూట్లను కూడా ట్రాఫిక్ కు అంతరాయాలు లేని విధంగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొన్నారు.ఆయా రోడ్లన్నీ పాట్ హోల్ ఫ్రీ రోడ్లుగా తీర్చి దిద్దాలని ఆర్ అండ్బి అధికారులకు సూచించారు. ఆయా రోడ్లపై గల వివిధ బాటిల్ నెక్స్ ను సరి చేయాలని చెప్పారు.వివిధ జిల్లాల నుండి సభకు తీసుకువచ్చే వారందరికీ అల్పాహారం,తాగునీరు, మజ్జిగ,పండ్లు,భోజనం వంటివి పంపిణీ చేయాలని సంబంధిత ఇన్చార్జులకు సూచించారు.ఈవిషయంలో రాజీ పడవద్దని ఎక్కడా ఫిర్యాదులు రాకుండా చుసుకోవాలన్నారు.

ఈనెల 29 సాయంత్రానికి మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆయా అధికారులకు చెప్పారు.30వ తేదీన రిహార్సల్ ఉంటుందని, తదుపరి ఎస్పిజి రిహార్సల్స్ ఉంటాయని తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించి ఆయా అధికారులకు కేటాయించిన పనులను వారి బృందాలతో సక్రమంగా జరిగేలా చూసుకోవాలని ప్రతి రోజు పర్యటించి పనులు సక్రమంగా జరిగేలా చూడాలని చెప్పారు. అంతేగాక ఏర్పాట్లకు సంబంధించి ప్రతి రోజు సా.4గం.లకు డైలీ నివేదికను సమర్పించాలని వీరపాండ్యన్ చెప్పారు.

ఈసమావేశంలో జిఏడి ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా,ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, సిఆర్డిఏ కమీషనర్ కె.కన్నబాబు,అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ మదుసూధన్ రెడ్డి,ఎన్టిఆర్,కృష్ణా,గుంటూరు జిల్లాల కలెక్టర్లు లక్ష్మిష, బాలాజీ,నాగలక్ష్మి,వివిధ శాఖల అధికారులు,పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *