విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో అమరావతి ‘ఐ’ హాస్పిటల్ సహకారంతో గాంధీనగర్ లోని విజయవాడ చాంబర్ భవన్లో సోమవారం నిర్వహించిన ఉచిత మెగా నేత్ర వైద్య సేవా శిబిరానికి విశేష స్పందన లభిం చింది. ఈ నేత్ర వైద్యశిబిరాన్ని విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు గడ్డం బాల వెంకట రవికుమార్ ప్రారంభించారు. ఈ నేత్ర వైద్య శిబిరాన్ని హాస్పిటల్ గౌరవ అధ్యక్షుడు వావిలాల రజనీకాంతశర్మ పర్యవేక్షించారు. చాంబర్ సభ్యులు, వివిధ వ్యా పార సంస్థల సిబ్బంది, ముఠా కార్మికులు 150 మంది వరకు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి దోషాలపై వైద్యులు పరీక్షలు జరిపి, అవసరమైన వారికి మందులు అందజేశారు. విజయవాడ చాం బర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ శ్రీకాంత్, కమిటీ మెంబర్లు కొత్త దుర్గా శ్రీనివాస్, జాలాది వెంకటేశ్వరరావు, ఎం.రామగోపాలరావు, మాజేటి చంద్రమోహనరావు తదితరులు నేత్ర వైద్య శిబిరంలో పాల్గొని తమ సేవలు అందించారు.
Prajavartha Online Telugu News