విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ పునరుత్పాదక ఇంధన కేంద్ర మంత్రి శ్రీపాద్ యశోద్ నాయక్ ,మహా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మేఘనా దీపక్ సాకోర్ లు బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పవన్ జీ బిజెపి నేతలను ఇరువురు మంత్రులకు పరిచయం చేశారు. ఈసందర్భంగా కేంద్రమంత్రి శ్రీపాద్ యశోద్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు నిధులు వరదలా ప్రవహిస్తాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో ప్రాముఖ్యత తెలుసుకున్నారు.చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అడిగితెలుసుకున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి విశిష్టత అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగామంత్రాలయం గురించి అడిగారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లో పార్టీ వేగవంతం గా పటిష్టం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వారధి ఇంఛార్జి కిలారు దిలీప్, బిజెపి ప్రోటోకాల్ ఇంఛార్జి పీయూష్, బిజెపి సోషల్ మీడియా రాష్ట్ర సభ్యులు సంజయ్, డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, పోతిరెడ్డి వెంకట్, మహిళా మోర్చా నేతలు బొమ్మ దేవర రత్నకుమారి, విజయశాంతి, పాలడుగు సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News