-పి.ఆర్.సి. కమిషన్‌ను తక్షణమే నియామించాలి..
-ఒక విడత DA మంజూరు చేయాలి..
-ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించండి..
-గురుకుల పాఠశాల ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచండి.
-• ఏపి ఎన్జిజీవో నేతలు కె.వి. శివారెడ్డి, ఎ.విద్యాసాగర్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని వేతన సవరణకు సంబంధించిన వేతన సవరణ కమిషనర్ ని వెంటనే ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న మూడు డీఏలలో కనీసం ఒక విడత డియ్యను మంజూరు చేయాలని, ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని,గురుకుల పాఠశాల ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు పెంచాలని ప్రభుత్వాని డిమాండ్ చేస్తూ ఏపి ఎన్జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసిన్నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె.వి. శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ తెలిపారు.
ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని ఎన్జీజిఓ హోమ్ లో మంగళవారం నిర్వహించారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధులతో రాష్ట్ర అధ్యక్షులు కె.వి. శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. మార్చి 17వ తేదిన జరిగిన ఏపీ జేఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 14 డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు. ఏప్రిల్ 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై డిమాండ్ల సాధన విషయంలో చర్చించడం జరిగిందన్నారు. ఈ సమావేశం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంఘం కోరిక మేరకు 6,300 కోట్ల రూపాయల నిధులను జమ చేయడంతో జి. పి. ఎఫ్., ఏపీజిఎల్‌ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రీయంబర్స్మెంట్ మరియు సిపిఎస్ చెల్లింపులు జరిగాయన్నారు. ఉద్యోగ సంఘాల ఆకాంక్షలను నేరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చీఫ్ సెక్రటరీలకు ఎన్జీజివో రాష్ట్ర కార్యవర్గం పక్ష్యాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు బకాయి ఉన్న మూడు డి.ఏలు ప్రభుత్వం మంజూరు చేయవలసి ఉన్నదని, కనీసం ఒక డి.ఏ మంజూరు చేసి సరెండర్ లీవ్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
ఏపీఎన్టిజీవో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాములో దాదాపుగా 30 వేల కోట్ల రూపాయల బకాయిలు పెండిరగులో ఉందన్నారు. అప్పట్లో ఉద్యోగులు స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం గాని, నిరసన తెలిపే హక్కును కూడా పూర్తిగా హరించిన విషయాన్ని గుర్తు చేశారు. నిరసన గళం ఎత్తిన వారిపై 3 వేలకు పైగా కేసు నమోదు చేయడం జరిగిందని, సకాలంలో వేతనాలను కూడా చెల్లించలేదన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి నెల 1వ తేదిన జీతాలను చెల్లించడంతో పాటు గత ప్రభుత్వం నిలిపివేసిన 7500 కోట్ల బకాయిలు ఉద్యోగులకు చెల్లించిందన్నారు. ఈ విషయంలో ఉద్యోగులు కొంత మేరకు సంతృప్తి చెందారన్నారు. అయితే ఉద్యోగులకు సంబంధించిన పిఆర్చి కమిషనర్ నియామకం, డి.ఏల మంజూరు, గురుకుల, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరంలకు పెంచాలని సరెండర్ లీవ్ బకాయిలు డి.ఎ., పి.ఆర్.సి బకాయిలు మంజూరు చేయడం వంటి అంశాలన్నిటి పైనా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియానుకం పొందిన ఉద్యోగులు 57 మెమో ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని కోరారు.
2024లో చేసిన చట్ట సవరణ ప్రకారం 2014 ముందుకు నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సమావేశంలో తీర్మానం చేశామని తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను వివిధ డిపార్ట్మెంట్లలో ప్రమోషనల్ ఛానళ్లను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ జేఏసీ ఇచ్చిన 14 డిమాండ్ల మీద ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలపై రోడ్ మ్యాప్ ప్రకటించాలనికూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించిందన్నారు. ఉద్యోగులకు సంబంధించి తీవ్రమైన పని ఒత్తిడి ఉందని, పరిమితికి మించి అవసరం లేని యాపులు, డేటా సర్వేలు, వీడియో కాన్ఫరెన్స్ లతో ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఉద్యోగులను సెలవు దినములలో కూడా కార్యాలయములో విధులు నిర్వహించవలసి రావటం, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించటంతో ఉద్యోగులు కుటుంబ సభ్యులతో గడిపే సమయం లేకుండా పోతుందని, ఈ విషయంపై ఉద్యోగులు ఎంతో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తెలిపారు. వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసే ఉద్యోగుల తగిన ఇంటర్నెట్ సిగ్నెల్ సదుపాయాలూ లేకుండా ఎఫ్ ఆర్ ఎస్ నమోదు చేయడం కష్టసాధ్యమైన విషయమని, ఫీల్డ్ లో ఉన్న మెడికల్ సిబ్బందికి ఫ్ఆర్‌ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కార్యవర్గం తీర్మానించినట్లుగా ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ వివరించారు.
పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి కె. జగదీశ్వరరావు, కోశాధికారి ఎ. రంగారావు, సహాధ్యక్షులు వి. దస్తగిరి రెడ్డి, ఉపాధ్యక్షులు డి.వి.రమణ, వై.ప్రసాద్,పి. శ్రీనివాస్, జె.మాధవ్, పి. శ్రీనివాసులు, ఎస్కె. నాగుర్ షరీఫ్, బి. వెంకటేశ్వర్లు, వి. కృష్ణ, ప్రచార కార్యదర్శి బి. జానకి, కార్యదర్శులు వి. సుబ్బారెడ్డి, ఎస్. బి. వి. రాంప్రసాద్, ఎ.ఆర్.కె నాయుడు, ఎం. వి. కృష్ణారెడ్డి, పి. శివప్రసాద్, మహిళా విభాగం చైర్పర్సన్ వి. నిర్మల కుమారి, కార్యదర్శి బి. తులసీ రత్నం, కన్వీనర్ పి. మాధవి, సబ్ కమిటీ కన్వీనర్ ఏఐఎస్ జిఈఎఫ్ ఎం. రాజలక్ష్మి, వి. శాంతిశ్రీ, క్యాపిటల్ సిటీ అధ్యక్షులు సిహెచ్ నాగభూషణం, కార్యదర్శి జి. కిషోర్ బాబు తదితరులతోపాటు రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అధ్యక్షలు కార్యదర్శలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News