విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బృహత్ బెంగళూరు మహానగర పాలికే (గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్) లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేశారు. బీబీఎంసీ లో గల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో విజయవాడ కార్పొరేటర్లకు ఆహ్వానం పలికిన బిబియం సి చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ ఐ.ఏ.ఎస్, గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సవాళ్లు, కార్పొరేషన్ స్థితి గతులను వివరించారు. ముందుగా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ లను పరిచయం చేస్తూ, విజయవాడ నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు అందించు సేవలను వారికీ తెలియపరచారు.
ఈ సందర్భంగా గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ మాట్లాడుతూ కార్పొరేషన్ గురించి వారు చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. 225 చదనపు కిలోమీటర్లతో మొదలైన బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం 700 చదనపు కిలోమీటర్ల విస్తరణలో, ఒక కొట్టి నలభై ఒక లక్షల జనాభాతో, గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ గా 8 జోన్ లతో అభివృద్ధి చెందిందని తెలిపారు. 25 నుండి 30 సంవత్సరాలు ఏవిధమైన నిర్వాహణ ఖర్చు లేకుండా ఉండే వైట్ టాప్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని ప్రస్తుతం బెంగళూరు నగరంలో 200 కిలోమీటర్ల వరకు వైట్ టాప్ రోడ్లు వివిధ ప్రాంతాలలో ఉన్నాయని అన్నారు.
నగరంలో మురుగునీటి పారుదలకు సంబంధించి K100 ప్రాజెక్ట్ ని ప్రస్తుతం చేపడుతున్నారని, కోరమంగళ వ్యాలీ నుండే మొదలై 100 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ ప్రాజెక్టుకు K100 స్ట్రామ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్ట్ సంబంధిత ప్రాజెక్ట్ అని, వర్షం పడినప్పుడు రోడ్డు మీద నీటి నిలువలు చేరకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టారని, అందులో భాగంగా 100 కిలోమీటర్ల దూరం వరకు ఈ ప్రాజెక్టుని అభివృద్ధి పరుస్తున్నారని, ప్రస్తుతం 11 కిలోమీటర్లు పూర్తి చేశారని అన్నారు. K100 ప్రాజెక్ట్ లో భాగంగా సహజ పద్ధతిలో స్ట్రామ్ వాటర్ డ్రైన్ లో కాలుష్యాన్ని కాలవలో పెరిగే మొక్కల ద్వారా తగ్గిస్తూ నీటి శుద్ధత చేస్తున్నారని, కేవలం వర్షపు నీటి డ్రైన్ మాత్రమే కాకుండా పచ్చధనాన్ని పెంపొందించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కడ అందిస్తున్నారని తెలిపారు.
భారతదేశంలోనే క్లైమేట్ యాక్షన్ ప్లాన్ నిర్వహించడంలో బెంగుళూరు 3వ నగరము అని, అందులో భాగంగా పర్యావరణం, సరస్సులు, అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యంగా నాలుగు సవాళ్లు ఎదుర్కొంటుందని అవి వ్యర్ధాలు, రోడ్లు, లైటింగ్, సరస్సులని తెలిపారు బీబీఎంసీ చీఫ్ కమీషనర్. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి గాలి నాణ్యత సరస్సులలో నీటి సాంద్రత, వెహికల్ ట్రాకింగ్ వంటి అంశాలు నిర్వహిస్తారని తెలిపారు.
ఈ సందర్బంగా పలువురు కార్పొరేటర్లు, బీబీఎంసీ కి సంబంధిత సందేహాలను అడిగి తెలుసుకున్నారు. బిబిఎంసి చీఫ్ కమిషనర్ డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజ రెడ్డి, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మిడి వెంకటేశ్వరావు, బుల్లా విజయకుమార్ బీజేపీ ను సన్మానించారు.
వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ బి బి ఎం సి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలిపి, వారి విజ్ఞానం యాత్రలో మంచి విజ్ఞానానికి కల్పించినందుకు విజయవాడ నగర పాలక సంస్థ తరఫున బీబీఎంసీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరి నాధ్ ఐ. ఏ. ఎస్ ను సత్కరించారు.
తదుపరి బీబీఎంసీ సిబ్బంది, కె.ఆర్ రోడ్డు ను చూపిస్తూ 15 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు అని దానికి ఇప్పటివరకు ఎటువంటి నిర్వహణ కార్యక్రమాలు చేపట్టలేదని, ఇంకో 15 సంవత్సరాల వరకు దానికి ఎటువంటి నిర్వహణ ఖర్చు అవసరం ఉండదని తెలిపారు. శాంతి నగర్ లో గల k100 ప్రాజెక్టులను ఫీల్డ్ లో చూపించి వివరించారు.
Prajavartha Online Telugu News