-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో డీసెల్టింగ్ పనులు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వన్ టౌన్, డ్రైన్ వీధి, సుబ్బారామయ్య వీధి, నెహ్రు రోడ్డు, బాబు రాజేంద్ర ప్రసాద్ రోడ్డు, గాంధీజీ మహిళా కళాశాల అన్న క్యాంటీన్, యం.జి రోడ్డు, ఈట్ స్ట్రీట్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డీసిల్టింగ్ పనులను నిరంతరం చేస్తూ, సరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వర్షపు నీటి నిల్వలు రోడ్డు మీద ఉండకుండా చర్యలు తీసుకోవాలని, డ్రెయిన్ వీధి, వన్ టౌన్లో గల డ్రైన్ ను పరిశీలించి అక్కడున్న ఫ్లోటింగ్ వ్యర్ధాలు, డిసిల్టింగ్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అన్నారు.
గాంధీజీ మహిళా కళాశాల వద్దగల అన్న క్యాంటీన్ ను పరిశీలించి, ఆహార నాణ్యత, పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి, వాడుక నీటి సరఫరా వంటి అంశాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు ఎప్పటికప్పుడు తమ తమ అన్న క్యాంటీన్లను పరిశీలిస్తూ ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఎంజీ రోడ్డు ఈట్ స్ట్రీట్ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. నిత్యం ఆహారం సేవించడానికి రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ ఎంతో ముఖ్యమని అందుకు అనుగుణంగా అధికారులు ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన వాతావరణం ప్రజలకు కల్పించాలని అన్నారు.
ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఎంజాయ్ సురేఖ, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News