-ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కో-ఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి పేరిట రైతుల భూములను చౌకగా తీసుకొని ప్రభుత్వ పెద్దల తమ అనుచరులకు కట్టబెట్టే విధానం రాష్ట్రంలో నడుస్తుంది అని ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కో-ఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు తెలిపారు. సోమవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుచరుడు సన్నిహితుడైన షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ అధినేత విశ్వే శ్వర్రెడ్డికి సంబంధించిన కంపెనీకి రామాయ పట్నం పరిధిలో చౌకగా రైతుల నుంచి భూములను సేకరించి కట్టబెట్టిన అంశం మీద అప్పటి ప్రతిపక్షం ఇప్పుడే అది కారపక్షమైనా టిడిపి జనసేన మాట్లాడి మేము వస్తే మీకు న్యాయం చేస్తాం అని ప్రజలను నమ్మించి ఓట్లు వేయిం చుకుని గెలిచారన్నారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడి చేసిన తర్వాత కేంద్రంలో బిజెపికి రాష్ట్రంలో టిడిపి కి నిధులు ఎన్ని కల బాండ్ల రూ పంలో ఇచ్చిన తర్వాత ప్రస్తుత కూటమి ప్రభు త్వం కూడా వైఎస్ జగన్మో హన్ రెడ్డి సన్ని హిత కంపెనీకి అనుకూలంగా పనిచేస్తూ కరేడు ప్రాంతంలో రైతులు దగ్గర భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. కంపెనీ కోసం తమను నమ్మి ఓట్లు వేసిన రైతుల భూము లను కట్టబెట్టా లని చూడ డం దుర్మార్గం అన్నారు. కరేడు ప్రాంతం రైతు లు ఎవరు కూడా అవినీతి ఆరోపణలు ఉన్న డొల్ల కంపెనీలకు భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని పిలుపు నిస్తున్నామని అన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అని అక్కడ ప్రజలు నమ్మి ఓటేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం శిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ అధినేత ఇచ్చిన ముడు పులు తీసుకుని రైతులను నిలువునా ముంచ బోతుండడం అంటే నమ్మించి గొంతు కోయ డమే అని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైజాగ్ లో అభివృద్ధి పేరట సుమారు 60 ఎకరాలు కంపెనీకి కట్టబెట్టడం ఆ కంపెనీ తాలూకా వ్యక్తులను గమనిస్తే లక్ష రూపాయల పెట్టు బడితో 1000 కోట్ల వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ 5000 కోట్లకు పైగా పెట్టు బడి పెడతాము అన్న విధంగా ప్రతిపాదనను చూస్తుంటే బినామీ కంపెనీల రూపంలో రాష్ట్రంలోకి నల్లధనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అలాగే ప్రభుత్వ భూము లను కాజేసే ప్రభు త్వం జరుగుతుంది అని అన్నారు. మా పార్టీ అభివృద్ధికి ఎప్పుడు వ్యతిరేకం కాదు అభివృద్ధి జరగాలంటే రైతు లను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ రైతులను ఒప్పించు భూసేకరణ చేయా లి గాని తమ బినామీ కంపెనీల కోసం రైతు లను భయపెట్టి రైతుల పొట్ట కొట్టే విధానాన్ని తాము ఎదిరిస్తాము అని అందుకోసం కార్యచరణ రూపొందించి రాష్ట్ర నాయకత్వంతో పాటు రాష్ట్రస్థాయి రైతు సంఘాలను పౌర సంఘా లను మిత్రపక్షాలను కలుపుకొని రైతు లకు మద్దతుగా గ్రామాల్లో పర్యటించి రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామన్నారు.
Prajavartha Online Telugu News